Home Latest News 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి…భార్యను కొట్టి చంపిన భర్త | వికారాబాద్ జిల్లా| తాండూరు పట్టణం| అనూష| పరమేష్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి – Andhra Waves

8 నెలల క్రితం ప్రేమ పెళ్లి…భార్యను కొట్టి చంపిన భర్త | వికారాబాద్ జిల్లా| తాండూరు పట్టణం| అనూష| పరమేష్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
8 నెలల క్రితం ప్రేమ పెళ్లి...భార్యను కొట్టి చంపిన భర్త | వికారాబాద్ జిల్లా| తాండూరు పట్టణం| అనూష| పరమేష్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి


డిసెంబర్ 18, 2025 2:44PMన పోస్ట్ చేయబడింది


రెండక్షరాల ప్రేమ అనే మత్తులో పడిన యువతి తన తల్లిదండ్రులను ఒప్పించి… ప్రేమపెళ్లి సంవత్సరం గడవకముందే భర్త తన విశ్వరూపం చూపించడంతో అది భరించలేక మృతి చెందిన ఘటన తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న సాయిపూర్ ప్రాంతంలో మానవత్వాన్ని కలిచివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామలు కలిసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అనూష (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

వికారాబాద్ జిల్లాకు చెందిన అనూష, తాండూరు కి చెందిన పరమేష్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరిస్తూ…ఎనిమిది నెలల క్రితం పరమేష్‌ను, అనూష ప్రేమ వివాహం చేసుకుంది. కోటి ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టిన అనూషకు వేధింపులే ఎదురయ్యాయి. అయితే ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో మొదటి నుంచి అనూషను వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రేమ పెళ్లిని అంగీకరించని అత్తమామలు అనూషతో తరచూ గొడవలకు దిగేవారు.

ఇటీవల జరిగిన గొడవలో భర్త పరమేష్ కూడా తల్లిదండ్రులతో కలిసి అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనూషను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కూతురు మరణించింది అని తెలియగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అత్త, మామ, భర్త కలిసి ప్రతిరోజు వేధింపులకు గురి చేసే వారిని.. తన కూతురిపై దాడి చేయడం వల్లే తన కూతురు మరణించింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనూష మరణించిందని తెలియగానే భర్త పరమేష్‌తో పాటు అత్త లాలమ్మ, మామ మొగులప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనూష తల్లి చంద్రమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పలుమార్లు వరకట్నం తీసుకురావాలంటూ నా బిడ్డతో గొడవ పడేవారు. ప్రతిరోజు నా బిడ్డను వేధింపులకు గురిచేసే వారిని… అత్త మామ భర్త ముగ్గురు కలిసి బాగా కొట్టి చివరకు ఆమె ప్రాణాలు తీసేశారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మరోసారి ప్రేమ వివాహాలపై కుటుంబ విరోధం, వరకట్న వేధింపులు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో స్పష్టం చేసింది. పోలీసులు నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird