Home Latest News ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం | ఫోన్ ట్యాపింగ్ కేసు| SIT| ప్రభాకర్ రావు| సుప్రీంకోర్టు| డీఎస్పీ ప్రణీత్ రావు| SIB| డీసీపీ రాధాకిషన్ రావు| తిరుపతన్న| ఫోన్ ట్యాపింగ్| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం | ఫోన్ ట్యాపింగ్ కేసు| SIT| ప్రభాకర్ రావు| సుప్రీంకోర్టు| డీఎస్పీ ప్రణీత్ రావు| SIB| డీసీపీ రాధాకిషన్ రావు| తిరుపతన్న| ఫోన్ ట్యాపింగ్| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం | ఫోన్ ట్యాపింగ్ కేసు| SIT| ప్రభాకర్ రావు| సుప్రీంకోర్టు| డీఎస్పీ ప్రణీత్ రావు| SIB| డీసీపీ రాధాకిషన్ రావు| తిరుపతన్న| ఫోన్ ట్యాపింగ్| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్


డిసెంబర్ 18, 2025 7:23PMన పోస్ట్ చేయబడింది


ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారణకు అనుమతించిన విషయం తెలిసిందే… ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు గుర్తించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు ఆయన దాటవేస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విచారణ రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతిని అందించారు. మరోసారి సుప్రీంకోర్టును కోరే అవకాశ ముందని సమాచారం. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird