Home Latest News అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి | అమెరికాలో అగ్నిప్రమాదం| తెలుగు విద్యార్థులు| అలబామా అగ్ని ప్రమాదం| భారతీయ విద్యార్థులు US| బర్మింగ్‌హామ్ అలబామా| అలబామా విశ్వవిద్యాలయం| ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు| తెలంగాణ విద్యార్థులు – Andhra Waves

అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి | అమెరికాలో అగ్నిప్రమాదం| తెలుగు విద్యార్థులు| అలబామా అగ్ని ప్రమాదం| భారతీయ విద్యార్థులు US| బర్మింగ్‌హామ్ అలబామా| అలబామా విశ్వవిద్యాలయం| ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు| తెలంగాణ విద్యార్థులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి | అమెరికాలో అగ్నిప్రమాదం| తెలుగు విద్యార్థులు| అలబామా అగ్ని ప్రమాదం| భారతీయ విద్యార్థులు US| బర్మింగ్‌హామ్ అలబామా| అలబామా విశ్వవిద్యాలయం| ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు| తెలంగాణ విద్యార్థులు


5 డిసెంబర్, 2025 9:16PMన పోస్ట్ చేయబడింది


అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో అలబామా యూనివర్శిటీలో సుమారు 10 మంది తెలుగు విద్యార్థులు నివాసముంటున్నారు.

ఈరోజు ఉదయం బర్మింగ్‌ హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొద్ది క్షణాల్లోనే దట్టమైన పొగలు ఆ ఏర్పాటు కమ్మేశాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ త్వరగా వ్యాపిస్తూ ఉండటంతో కాసేపటికే అపార్ట్‌మెంట్‌ను దట్టమైన పొగతో కమ్మేయడంతో అందులో నివాసం ఉంటున్న విద్యార్థులు శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కానీ ఇప్పటికే చుట్టూ దట్టమైన పొగ వ్యాపించడంతో వారు లోపల చిక్కుకుపోయారు. సమా చారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘ టనా స్థలానికి చేరుకుని లోపల చిక్కుకొని పోయిన వారందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. మొత్తం 13 మంది విద్యార్థులను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చిన అనంతరం ఫైర్ సిబ్బంది వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్ర గాయాలైన ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, మరో విద్యార్థి కూకట్‌పల్లికి చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరూ అల బామానివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.ఈ ఘటనతో అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అగ్ని ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు గుర్తించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird