విదేశీ సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని ఖండిస్తూ బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ అందెగత్తెల కాళ్లను కడిగించడం అవమానకరం.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.
మన ఆడబిడ్డలను, దళిత, గిరిజన మహిళలను బానిసలుగా చూస్తారా?
సంప్రదాయాలను గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
ప్రపంచ అందగత్తెల పోటీ పేరుతో తెలంగాణ మహిళలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం కాంగ్రెస్ ప్రభుత్వ బానిసత్వానికి, మహిళల పై ద్వేష భావానికి నిదర్శనం. ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం మీద దాడే. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని బిజెపి మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది.
అందాల పోటీల్లో భాగంగా రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చిన సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడపడుచుల చేత కడిగించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. దళిత, గిరిజన మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు మరింత అవమానకరం. ఈ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణ ఘటనకు తక్షణ క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ గర్వించే సమ్మక్క సారలక్క పుట్టిన ప్రాంతంలో ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ప్రతి ఒక్కరి గౌరవం తప్పనిసరి. అందాల పోటీలకు వచ్చిన విదేశీ సుందరీమణుల గౌరవం కూడా చాలా ముఖ్యమే, కాని మన సొంత ఆడపడుచుల గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. మహిళల ఆత్మగౌరవం పరిరక్షణకే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతిని, మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. నాకు ఒక్క రూపాయి పైసా కూడా అప్పు పుట్టడం లేదు అని కొన్ని వందల కోట్లు పెట్టీ అందాల పోటీలు మన తెలంగాణ లో పెట్టడం ఎంతవరకు అవసరం. ఒక పక్క అకాల వర్షాల వల్ల రైతులు ఘోష పెట్టుకుంటే కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలతో చాలా చాలా బిజీగా ఉండటం చాలా చాలా బాధాకరం.

