Home సినిమా అపరిచితుడు అలియాస్ రుక్మిణి – iDreamPost – Andhra Waves

అపరిచితుడు అలియాస్ రుక్మిణి – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
అపరిచితుడు అలియాస్ రుక్మిణి - iDreamPost


యంగ్ హీరో నితిన్ లీడ్ రోల్‌లో, నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ మూవీలో ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే.. ఒకప్పుడు రచయితలు మారుపేరుతో రచనలు చేసేవారు. ఆ థీమ్ తోనే ట్రయిలర్ చూడండి. చూస్తుంటే, ఆ పుస్తకాలు, కవర్ పేజీలు అన్నీ కూడా పీరియాడిక్ లుక్ సూచిస్తున్నాయి.

ఇందులో నితిన్ ‘కృష్ణ’ అనే ఫ్యామిలీ కోర్టు స్టెనోగ్రాఫర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బయటకు చాలా సైలెంట్‌గా, సాదాసీదాగా కనిపించే కృష్ణకు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ టాలెంట్ ఉంటుంది. అదేంటంటే.. ఎవరికీ తెలియకుండా ‘కోరికలే గుర్రాలైతే’ లాంటి అవేర్‌నెస్ పుస్తకాలు రాస్తుంటాడు. మరోవైపు పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతిసారీ అమ్మాయిల చేతిలో రిజెక్ట్ అవుతుంటాడు. ఇలాంటి టైమ్‌లో హీరోయిన్ (ఆఫియా సయ్యద్) లైఫ్‌లోకి రావడం, ఇద్దరి మధ్య జరిగే సరదా సంభాషణలు ట్రైలర్‌లో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి.

అయితే ట్రైలర్‌లో అసలైన ట్విస్ట్ చివర్లో మొదలవుతుంది. కృష్ణ మైండ్‌లో వినిపించే మరో గొంతు, అతడి లోపలి సంఘర్షణను చూపించిన విధానం ఆసక్తికరంగా ఉంది. హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాక ఎదురయ్యే ఎమోషనల్ టర్న్ తర్వాత.. “ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి? కృష్ణనా లేక రుక్మిణినా?” అనే డైలాగ్ సినిమాల ట్విస్ట్ ను టర్న్ ను ప్రకటించేసింది. ఇక ఏడుస్తూ “నా ఫీలింగ్స్, నా ఇష్టం.. నాకు బాధగా ఉంది, ఏడుస్తా!” అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్, అతడి బాడీ లాంగ్వేజ్ రొటీన్‌కు భిన్నంగా, చాలా కొత్తగా ఉన్నాయి.

ఫన్, లవ్, ఎమోషన్‌తో పాటు ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అసలు కాన్ ఫ్లిక్ట్ ఏమిటన్నది ట్రయిలర్ లో పూర్తిగా చూపించలేదు. అదో రకమైన పుస్తకాలు మారుపేరుతో రాయడమే హీరోయిన్ కోపానికి కారణమా? అసలు హీరోకి వచ్చే కలల అంతరార్ధం ఏమిటి అన్నది అసలు పాయింట్. డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘అలియాస్ రుక్మిణి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird