Home Latest News ట్రంప్ టారిఫ్ టెర్రర్ మరోసారి: ఇండియా సహా 14 దేశాలపై పన్నుల మోత.! | US సుంకాలు | భారతదేశం | మరో 13 దేశాలు | US వాణిజ్య ఒప్పందం | సుంకాలు | ట్రంప్ | అమెరికా – Andhra Waves

ట్రంప్ టారిఫ్ టెర్రర్ మరోసారి: ఇండియా సహా 14 దేశాలపై పన్నుల మోత.! | US సుంకాలు | భారతదేశం | మరో 13 దేశాలు | US వాణిజ్య ఒప్పందం | సుంకాలు | ట్రంప్ | అమెరికా – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ ల కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇండియా సహా మొత్తం 14 దేశాలపై కొత్తగా సుంకాలు విధించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ట్రంప్ ప్రతిపాదనలు రెడీ చేసింది. ఆయా దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా వాణిజ్యంపై ప్రభావం చూపుతోందన్న కారణంగా ఈ సుంకాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సెక్షన్ 301 నిబంధనల ప్రకారం అనైతిక వ్యాపారంపై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 16 దేశాలపై ఎనిమిది నెలల పాటు నిర్వహించిన అనంతరం ఇండియా సహా 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాలు విధించాలన్ననిర్ణయానికి వచ్చింది.
ఈదేశాల జాబితాలో ఇండియా తో సహా , చైనా, బంగ్లాదేశ్, కంబోడియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఉన్నాయి.

ముందుగా పరిశీలించిన 16 దేశాల్లో మెక్సికో , నార్వేలను సుంకాల ప్రతిపాదన జాబితా నుంచి మినహాయించారు. సంబంధిత వాణిజ్య సంస్థలు తయారీ రంగంలో డిమాండ్‌కు మించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల అమెరికా సంస్థలతో ఆ దేశాల కంపెనీలకు ధరలపరంగా ప్రయోజనం లభిస్తోందని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా చైనా తక్కువ ధరలకు భారీ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లలోకి విడుదల చేస్తోందన్న అంతర్జాతీయ నేపథ్యం ఆ దేశంపై అదనపు సుంకాన్ని ప్రతిపాదించింది.

వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందాన్ని గౌరవించడంలో చైనా విఫలమైతే అదనంగా 20 శాతం సుంకం విధించాలని, దీని వలన సుంకాన్ని గరిష్ఠంగా 40 శాతం పెంచాలని ఈ తాజా ప్రతిపాదన. అలాగే వియత్నాంపై 35 శాతం, ఇండియాతో పాటు మిగిలిన దేశాలపై పాతిక శాతం సుంకాలు విధించాలని ట్రంప్ సర్కారు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది.

ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, వాషింగ్టన్‌తో ఇంకా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని దేశాల్లో ఇండియా, వియత్నాం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన సుంకాల ద్వారా వాణిజ్య ఒప్పంద చర్చల్లో అమెరికా తన పట్టును పెంచుకోవాలన్నది లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏయే దేశాలపై ఎంతెంత మేర సుంకాలు అమలు చేస్తారనే స్పష్టమైన వివరాలను యూఎస్ ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ద్వారా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: హుందాతనం లేని ట్రంప్ తీరు: వలస విధానాలు, టారిఫ్ టెర్రర్.. రిపబ్లికన్ల పరాభవ కారణాలు.!

అంతర్జాతీయ వాణిజ్యంలో సెక్షన్ 301 కింద చేపట్టే విచారణలు, సుంకాల ప్రతిపాదనలు ఎగుమతి, దిగుమతి రంగాలపై కీలక చూపుతాయి. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తి, ధరల పోటీతత్వం వంటి అమెరికా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా నిలుస్తున్నాయి. వివిధ దేశాలతో జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి.

ఎగుమతి ఆధారిత రంగాలు, వాణిజ్య సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజిస్టర్ నోటీసు వెలువడిన తర్వాత ప్రతిపాదిత సుంకాల పరిధి, అమలు విధానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు దిశగా సాగుతాయనే అంశంపై భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి చూపబడింది. భారత్‌తో పాటు ఇతర దేశాలపై ప్రతిపాదించిన సుంకాల అంశం వాణిజ్య చర్చల ద్వారా లేదా సానుకూలంగా పరిష్కారమవుతుందా అనే దానిపై పరిశీలకులు దృష్టి సారించారు.

మీకు నచ్చవచ్చు: మళ్లీ ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్.!

ట్రంప్ టారిఫ్ లపై అమెరికాలో రివోల్ట్.!


[US tariffs, India, 13morecountries, US trade agreement, tariffs, Trump, America, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird