
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును గురువారం (నవంబర్ 26) వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో పాటు 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఆయన ఉండవల్లి ఎంపీయూపీ పాఠశాల స్థానంలో ఓటు వేశారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే, ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థలను ప్రశ్నించే హక్కు ఉంది.

అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారతదేశానికి స్పష్టమైన దశ, దిశ నిర్దేశించిందని అన్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగం ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని అందించిన చంద్రబాబు.. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ తమ ఓటును ఉపయోగించుకోవాలని సూచించారు.
[CM Chandrababu, Cast, Vote, ConstitutionDa, greetings, TeluguOne]
