Home సినిమా వరుస ఫ్లాపులు వస్తే దర్శకుడి గొప్పతనం ఏమవుతుంది? ఒక్క హిట్ పడగానే ఆకాశానికెత్తేయడం ఎందుకు? – Andhra Waves

వరుస ఫ్లాపులు వస్తే దర్శకుడి గొప్పతనం ఏమవుతుంది? ఒక్క హిట్ పడగానే ఆకాశానికెత్తేయడం ఎందుకు? – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలుగువన్ సినిమా


బొమ్మ హిట్టు.. ఈ సందర్భంగా ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ సినిమా డైరెక్టర్ తనేదో మాయబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథను తెరకెక్కించిన అపర మేధావిల ఎక్స్ ప్రెషన్ ఇస్తూ స్టేజ్ కింద కూర్చున్నాడు. ఒక సినీ అతిధినో, లేక మరో డైరెక్టర్ నో స్టేజ్ పై ఇక ఆ డైరెక్టర్ ని అద్భుతమైన మూవీ తెరకెక్కించాడని తనకి దగ్గరికి వచ్చిన పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. కింద ఉన్న మన లెజండ్రీ దర్శకుడు అదే మేధావి మూసి నవ్వుని ప్రదరిస్తూ ఉంటాడు. ఆ టైంలో అతని కళ్ళని క్షుణ్ణంగా పరిశీలించాలి నా సామి రంగ నేను లేకపోతే తెలుగు సినిమా ఏమైపోతుందా అనే భావం తన కళ్ళల్లో క్షుణ్ణంగా కనిపిస్తుంటుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన ట్రెండ్ ఏర్పడింది. ఒక దర్శకుడు వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ చేస్తే ఆయన గురించి మాట్లాడేవారే ఉండరు. అదే ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఒక్కసారిగా దర్శకుడి పేరు మార్మోగిపోతుంది. అద్భుతమైన దర్శకుడు, విజనరీ, ఇండస్ట్రీని మార్చేస్తే సత్తా ఉన్న వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మరి ఒక హిట్‌తోనే దర్శకుడి ప్రతిభను కొలవచ్చా? వరుస పరాజయాలు ఎదురైనప్పుడు ఆయన గొప్పతనం ఏమైపోతుంది?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికులు, కొత్తగా పెళ్లి అయిన మొగుడు పెళ్ళాం కూడా ఒకరికొకరు అంత ప్రాధాన్యత ఇచ్చుకోరు. దర్శకుడికి వరుస అవకాశాలు వస్తాయి. నిర్మాతలు క్యూ కడతారు. హీరోలు కూడా కథలు వినేందుకు ఆసక్తి చూపిస్తారు. అదే రెండు సినిమాలు ఫ్లాప్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గతంలో చేసిన మంచి సినిమాలని మర్చిపోయి విమర్శలు మొదలుపెడతారు.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దర్శకుడి ప్రతిభ అనేది ఒక్క సినిమా విజయంతోనే నిర్ణయమవుతుందా? లేక అతడి ఆలోచనా విధానం, కథను తెరపై చూపించే విధానం, నటినటుల నుంచి నటన రాబట్టే సామర్థ్యం, ​​విభిన్న కథలను చెప్పగలిగే నైపుణ్యం ఆధారంగా నిర్ణయించాలా?

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఏడాది పాటు థియేటర్లలో ఆడే సినిమాలను ప్రదర్శించిన దర్శకులు ఎందరో ఉన్నారు. వారి సినిమాలు రికార్డులు సృష్టించినా, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందినా.. తమ విజయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకోవడం కనిపించదు. సినిమా మాట్లాడాలి కానీ దర్శకుడు తన గురించి తాను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదనే విధంగా వారి వ్యవహారశైలి ఉండేది.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకుంది అందుకే: భోగి డైరెక్టర్ సంపత్ నంది

అప్పటి దర్శకులకు సక్సెస్ అనేది బాధ్యతని పెంచే అంశం. ఒక హిట్ వచ్చిందంటే తదుపరి సినిమా మరింత బాగుండాలనే ఆలోచన చేసేవారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేసేవారు. అందుకే దర్శకుల కొన్ని దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి.

అయితే వరుస ఫ్లాపులు వచ్చినంత మాత్రాన ఒక దర్శకుడిలో ప్రతిభ లేదని చెప్పలేం. సినిమా విజయం వెనుక కథ, స్క్రీన్ ప్లే, నటినటులు, నిర్మాణం, మార్కెటింగ్, విడుదల సమయం ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఒక్కోసారి మంచి ప్రయత్నం కూడా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. అదే సమయంలో సాధారణమైన కథ కూడా అనూహ్యమైన విజయాన్ని అందుకోవచ్చు.

కానీ వరుస పరాజయాల తర్వాత కూడా తన తప్పులను పధ్ధతి చేసుకోకుండా, గతంలో వచ్చిన ఒక్క హిట్‌ను చూపిస్తూ గొప్పలు చెప్పడం సరైనది కాదు. విజయంతో పాటు అపజయాల నుంచి నేర్చుకోవడం కూడా దర్శకుడి ఎదుగుదలలో భాగమే.

ఒక్క బ్లాక్‌బస్టర్ ఇచ్చినంత మాత్రాన గొప్ప దర్శకుడు అయిపోరు. అలాగే ఒక్క ఫ్లాప్‌తో ప్రతిభ లేని దర్శకుడిగా ముద్ర వేయలేం. విభిన్న కథలను ప్రదర్శించడం, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం, విజయాపజయాలను సమానంగా స్వీకరించడం.. ఇవన్నీ ఒక దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి.

ముఖ్యంగా తన సినిమాల గురించి తానే గొప్పలు చెప్పుకోవడం, తన పనితో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకోవడమే నిజమైన దర్శకుడి లక్షణం.

చివరిగా ఒక్క మాట.. హిట్ వచ్చినప్పుడు పొగడ్తలు, ఫ్లాప్ వచ్చినప్పుడు విమర్శలు సహజం. కానీ దర్శకుడి అసలు స్థాయి ఒక్క సినిమాతో తేలిపోదు. ఒకటి కాదు.. ఎన్నో సినిమాల ప్రయాణమే అతడి ప్రతిభకు కొలమానం. హిట్ వచ్చినప్పుడు ఒదిగి ఉండటం, ఫ్లాప్ వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడం.. ఈ రెండు ఉన్నప్పుడు ఒక్క దర్శకుడికి నిజమైన గౌరవం దక్కుతుంది.

కాబట్టి దర్శకుడా నీ పోస్ట్ ఋషి లాంటిది. ఋషి లాగే ఉండు. అంటే అడిగిన, అవసరమైన ప్రశ్నలకే సమాధానం చెప్పడం. నీ భావాలని సెల్యులాయిడ్ పై పంచి చాలా ఆనందంగా ప్రజల రూపంలో ఉన్న ప్రేక్షకులకి, మంచిని పంచడం.

మీకు నచ్చవచ్చు

ఆస్కార్ బరిలో రామాయణం: కాకపోతే ఈ గండాలు వెంటాడుతున్నాయి!

చిన్నారి ఇన్‌స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా!

[Tollywood Directors, Director, Telugu Cinema, Mayabazar, Pathala Bhairavi]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird