Home సినిమా ఎడిటింగ్ రాదా? ఇక టెన్షన్ వద్దు – Andhra Waves

ఎడిటింగ్ రాదా? ఇక టెన్షన్ వద్దు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎడిటింగ్ రాదా? ఇక టెన్షన్ వద్దు


శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్‌లో ఉన్న ఫోటోలతోనే నిమిషాల్లో చిన్న వీడియోలు, సోషల్ మీడియా షార్ట్‌లు తయారు చేసుకునే అవకాశం త్వరలో రాబోతోంది. ప్రత్యేకంగా మరో యాప్ లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం గ్యాలరీలోనే ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు శాంసంగ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఫోన్‌లో తీసిన ఫోటోలతో వీడియో తయారు చేయాలంటే యాప్‌లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఫోటోలు, వరుసగా వాటిని పెట్టడం, పాటలు జోడించడం, ఎఫెక్ట్స్ ఇవ్వడం.. ఇలా చాలా పనులు చేయాలి. కానీ శాంసంగ్ తీసుకురాబోతున్నట్లు చెబుతున్న కొత్త Shorts ఫీచర్ ఈ పనులను చేయడం సులభం. ఫోన్‌లో ఇప్పటికే ఉన్న ఫోటోలు, వీడియో క్లిప్స్‌ను ఉపయోగించి చిన్న వీడియోలను ఆటోమేటిక్‌గా తయారు చేసుకునే అవకాశం ఉండొచ్చని SamMobile నివేదిక. ఈ ఫీచర్ గెలాక్సీ AI ఆధారంగా పనిచేయనుంది. ముఖ్యంగా స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు వంటి ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు షేర్ చేస్తే వారికి ఇది ఉపయోగపడుతుంది.

నచ్చిన వీడియోను AIతో తయారు చేసుకోవచ్చు
ఈ ఫీచర్‌లో ఆటోమేటిక్ వీడియో తయారీతో పాటు మనకు నచ్చిన విధంగా వీడియో రూపొందించుకునే అవకాశం కూడా ఉండొచ్చని సమాచారం. ఉదాహరణకు, ఇటీవల చేసిన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలతో వీడియో కావాలనుకుంటే.. ‘నా ఇటీవలి ట్రిప్ ఫోటోలతో వీడియో తయారు చేయి’ అని ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ వివరాలకు సరిపోయే ఫోటోలు, వీడియో క్లిప్స్‌ను గ్యాలరీ నుంచి ఎంచుకొని AI చిన్న వీడియోగా మార్చే అవకాశం ఉంది. అంటే ప్రతి ఫోటోను విడివిడిగా ఎంచుకొని ఎడిట్ చేయాల్సిన పని తగ్గుతుంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు వీడియోను మార్చుకునే అవకాశం ఉంటుంది అనే విషయాలపై శాంసంగ్ ఇంకా పూర్తి వివరాలను ప్రకటించలేదు.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మార్చుకోవచ్చు
వీడియో తయారైన తర్వాత దాన్ని మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకునే సౌకర్యాలు కూడా ఉండొచ్చని సూచిస్తున్నాయి. కొత్త ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించడం వంటి ఆప్షన్‌లు అందుబాటులోకి రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇలా తయారైన వీడియోలు శాంసంగ్ గ్యాలరీలోని కథనాలు కనిపిస్తాయని సమాచారం. అక్కడి నుంచి వాటిని చూసుకోవడం, అవసరమైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం సులభం కావచ్చు. అయితే నేరుగా ఏయే సోషల్ మీడియా యాప్‌లకు షేర్ చేసే అవకాశం వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

One UI 9.5 బీటాలో కనిపించిన కొత్త ఫీచర్
ప్రస్తుతం ఈ ‘షార్ట్’ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని SamMobile. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం One UI 9.5 బీటా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బీటాలో కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి, సాధారణ వినియోగదారులకు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. శాంసంగ్ అధికారికంగా ప్రకటించిన One UI 9.5 బీటా ఫీచర్ల జాబితాలో కూడా Shorts ప్రస్తావన లేదు. కాబట్టి ఇది ఇంకా పరీక్షల్లో ఉన్న ఫీచర్‌గానే చూడాలి.

ఫ్రీగా వస్తుందా? డబ్బులు చెల్లించాలా?
ఈ ఫీచర్‌పై ఆసక్తి పెంచుతున్న మరో విషయం దీని ధర. గెలాక్సీ AI ఆధారంగా పనిచేసే ఈ షార్ట్‌లు సదుపాయం పెయిడ్ ఫీచర్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నివేదికలు చెబుతున్నాయి. అంటే దీన్ని ఉపయోగించాలంటే ప్రత్యేకంగా చార్జీ చెల్లించాల్సి రావచ్చు. అయితే శాంసంగ్ ఇప్పటివరకు ధర, సబ్‌స్క్రిప్షన్ వివరాలను ప్రకటించలేదు. ఈ ఫీచర్ 2027 ప్రారంభంలో Galaxy S27 సిరీస్‌తో పాటు పరిచయం కావచ్చని SamMobile అంచనా వేసింది. ఇది కూడా అధికారిక ప్రకటన కాదు. కాబట్టి ఫీచర్ ఎప్పుడు వస్తుంది, ఏ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది, ఉచితమా లేదా పెయిడా అనే విషయాలపై శాంసంగ్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird