Home Latest News ఫోన్ చేసి బయటకు పిలిచారు.. సింగరేణి ఉద్యోగిని చంపేశారు.! | గోదావరిఖని హత్య | సింగరేణి ఉద్యోగి హత్య | పెద్దపల్లి క్రైం న్యూస్ | గోదావరిఖని క్రైం – Andhra Waves

ఫోన్ చేసి బయటకు పిలిచారు.. సింగరేణి ఉద్యోగిని చంపేశారు.! | గోదావరిఖని హత్య | సింగరేణి ఉద్యోగి హత్య | పెద్దపల్లి క్రైం న్యూస్ | గోదావరిఖని క్రైం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది. సింగరేణి సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ (30)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. సోమవారం తెల్లవారుజామున పవర్‌హౌస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజశేఖర్‌ను హత్య చేయడానికి నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. ముందుగా అతడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని పిలిచారు. ఫోన్ కాల్‌ను నమ్మి రాజశేఖర్ బయటకు రాగానే అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న నలుగురు యువకులు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగారు. ఊహించని ఈ దాడితో రాజశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకు ముందు రాజశేఖర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? దాడికి పాల్పడ్డ ఆ నలుగురు యువకులు ఎవరు? ముందుగానే పథకం రచించి ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నిత్యం రద్దీగా ఉండే పారిశ్రామిక ప్రాంతంలో ఓ సింగరేణి ఉద్యోగిని ఇలా ఫోన్ చేసి ఇంటికి పిలిచి హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజశేఖర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం. చేతికి అందివచ్చిన కుమారుడు, కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న వ్యక్తి హఠాత్తుగా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, హత్య వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు.

మీకు నచ్చవచ్చు: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం.!

మీకు నచ్చవచ్చు: Facebook క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!

[ Godavarikhani Murder, Singareni Employee Murder, Peddapalli Crime News, Godavarikhani Crime, Telangana Murder Case ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird