Home సినిమా థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో రికార్డు రేటింగ్స్‌తో దూసుకుపోతోంది! – Andhra Waves

థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో రికార్డు రేటింగ్స్‌తో దూసుకుపోతోంది! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సినిమా బాగుంటే పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి నిరూపిస్తోంది ‘హ్యాపీ జర్నీ’. ఎలాంటి భారీ అంచనాలు, హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్‌లో నిలవడంతో పాటు, రేటింగ్స్ విషయంలోనూ మంచి స్పందన వస్తోంది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి. జీవితాలంటే మార్చేస్తాయి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఐఎండీబీలో 9.7/10 రేటింగ్, బుక్ మై షోలో 9.5/10 రేటింగ్ సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రేటింగ్స్ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ స్థాయి రేటింగ్స్ రావడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మీకు వయసులు, మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలు ఒక యూరప్ ట్రిప్‌కు బయలుదేరుతారు. వారి ప్రయాణం మొదట్లో సరదాగా సాగినా.. ఒక్కొక్కరి మధ్య అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఈ తరాలకు చెందినవారు ఒకే ప్రయాణంలో కలవడంతో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలా నవ్వులు, భావోద్వేగాల మధ్య సాగుతున్న వారి ప్రయాణంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది.

ఈ సినిమాలో ఆమని, అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, సునైనా బాదం, రూపా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. వంశీధర్ గౌడ్, రవి శివతేజ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. అభిరామ్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమయ్యారు. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.. మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్‌లోనూ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడగలిగే ఫీల్ గుడ్‌టైనర్ కోసం వారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళల ప్రయాణం, వారి మధ్య స్నేహం, అనుబంధాలు, ఎదురయ్యే అనూహ్య సంఘటనలతో కథ సాగడం ఈ సినిమాకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

మొత్తానికి థియేటర్లలో పెద్దగా ప్రచారం పొందని ‘హ్యాపీ జర్నీ’ ఓటీటీలో మాత్రం కొత్త ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఓటీటీలో మంచి రేటింగ్‌తో ట్రెండింగ్‌లో ఉండటంతో అసలు ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంది.

[HappyJourneyMovie, HappyJourneyOTT, SunNXT, AamaniMovies, AnnapurnammaMovies]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird