హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హై బడ్జెట్ ఫిల్మ్..హైందవ. డివోషనల్ టచ్ మిస్టిక్ యాక్షన్ సినిమా. ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో వుంది. చాలా స్పాన్ వున్న కథ. బడ్జెట్ చేసే డిమాండ్ కథ. అందుకే నిర్మాత వెనక్కు తగ్గకుండా దాదాపు 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది. పోనీ యాభై కే ఫిక్స్ చేసుకున్నా, అది ఈ రోజుల్లో బెల్లంకొండ మీద భారీ బడ్జెట్ పెట్టినట్లే.
ఒకప్పుడు బెల్లంకొండకు హిందీ డబ్బింగ్ మార్కెట్ చాలా బాగా వుండేది. ఇప్పుడు బెల్లంకొండ కే కాదు, అందరికీ హిందీ మార్కెట్ దారుణంగా తగ్గిపోయింది. అయితే లక్కీగా ఈ సినిమా చాలా కాలం కిందటే అమ్మేసారు. అలాగే డిజిటల్ హక్కులు అన్నీ విక్రయించేసారు. మొత్తం మీద 24 కోట్లు నాన్ థియేటర్ వచ్చినట్లు. సినిమా థియేటర్ లో బాగా ఆడితే డిజిటల్ సంస్థలు మరో రెండు కోట్లు చెల్లిస్తాయి. అంటే మొత్తం మీద 26 కోట్లు వచ్చినట్లే.
ఇప్పుడు మరో 24 కోట్లు థియేటర్ మీద నుంచి రావాలి. అంటే ఆంధ్ర కనీసం 10 కోట్ల రేషియోలో అమ్మాలి. అలాగే నైజాం, రాయలసీమ నుంచి మరో పది కోట్లు రాబట్టాలి. కర్ణాటక, ఓవర్ సీస్ ఇలా అన్నీ కలిపి మరో అయిదు కోట్లు సమీకరించాలి.
సినిమా పెద్ద అయితే హిట్ థియేటర్ మీద నుంచి మంచి మొత్తాలు వస్తే నిర్మాతకు లాభాలు వస్తాయి. లేదు హిట్ అనిపించుకున్నా, అమ్మిన మేరకు వసూళ్లు వస్తే నిర్మాతకు ఏ నష్టమూ వుండదు. లాభమూ వుండదు. ఇప్పుడు అవుతా ఇలాంటి జానర్ సినిమాలు అన్నీ బాగా ఆడుతున్నాయి కనుక, నిర్మాత సేఫ్ రనే ఆశిద్దాం.
ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయాలనుకుంటున్నారు. ఓ రెండు వారాలు వెనక్కు వెళ్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.
The post హైందవ..థియేటర్ కాపాడాలి appeared first on iDreamPost.
