
2002 గుజరాత్ అల్లర్ల నాటి సామూహిక అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ప్రకటన వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఈ తీర్పుపై బల్కిస్ బానో ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారంటే.. అప్పటి అల్లర్లలో అప్పటికి ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె అలుపెరుగని పోరాటం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసులో ఇద్దరు దోషులకు సుప్రం కోర్టు బెయిలు ఇవ్వడంపై తీవ్ర దిగ్భ్రాంతి, అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు తన న్యాయవాది శోభా గుప్తా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో బిల్కిస్ బానో.. తాను 24 ఏళ్లుగా సాగించి న్యాయం దూరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మీడియా ద్వారానే సుప్రీంకోర్టు బెయిల్ ఆదేశాల విషయం తనకు తెలిసిందన్న ఆమె, తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నా వాదన వినకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి, పోరాడి గెలుచుకున్న న్యాయాన్ని సుప్రీం నిర్ణయంతో కోల్పోయినట్లు అయ్యిందని బాల్కిస్ బానో ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తీర్పుతో తన కుటుంబం, తన పిల్లల భద్రతపై భయాలు మళ్లీ చుట్టుముట్టాయని పేర్కొన్నారు.

ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియా అనే ఇద్దరు దోషులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష పూర్తి చేశారని, వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం (నవంబర్ 16) బెయిల్‌కు సంబంధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2022లో గుజరాత్ ప్రభుత్వం ఈ దోషులతో సహా 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా, 2024 జనవరి 8న సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ వారందరినీ తిరిగి జైలుకు పంపిన సంగతి విధితమే.
ఇది కూడా చదవండి: గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి ఊరట
తాజా పరిణామంపై స్పందించిన బిల్కిస్ బానో, ఈ ఉత్తర్వులను తాను చట్టపరంగా సవాలు చేస్తానని స్పష్టం చేశారు. 2002 నాటి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన తన మూడేళ్ల కుమార్తె సలేహా జ్ఞాపకార్థం, అలాగే తన పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటూ తాను ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

న్యాయ వ్యవస్థపై తనకు ఇప్పటికీ అచంచలమైన విశ్వాసం ఉందని, అయితే ఈ ప్రక్రియలో తన గొంతు వినిపించే అవకాశం కోల్పోవడం బాధాకరమని బిల్కిస్ చెప్పారు. దోషుల విడుదలను సవాలు చేస్తూ త్వరలోనే కోర్టుకు వెడతామని ఆమె తరఫు న్యాయవాదులు.
మీకు నచ్చవచ్చు: హనీట్రాప్ వలలో మాజీ సైనికుడు: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బ్లాక్ మెయిల్.!
జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!
[BilkisBanocase, SupremeCourt, Gujaratriotsconvicts, BilkisBanoreaction, TeluguOne]
