మలయాళ సినిమాల్లో విభిన్నమైన కథలను ఇష్టపడేవారికి ‘అజయంతే రందం మోషణం’ (ARM) మంచి ఎంపిక. టొవినో థామస్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మూడు తారలు, ఒక విలువైన నిధి, దాని చుట్టూ అల్లుకున్న పోరాటం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.
ఈ సినిమా కథ ఉత్తర కేరళ నేపథ్యంలో 1900, 1950, 1990 కాలాల్లో సాగుతుంది.ఈ మూడు కాలాలకు చెందిన మణియన్, కుంజికేలు, అజయన్ అనే మూడు పాత్రల్లో టొవినో థామస్ కనిపిస్తారు.మణియన్ ఒక ధైర్యవంతుడైన వ్యక్తి. అతడి తర్వాతి తరానికి చెందిన కుంజికెలు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఇక మూడో తరానికి చెందిన అజయన్ తన పూర్వీకుల చరిత్రతో పాటు ఓ విలువైన నిధి చుట్టూ ఉన్న రహస్యాలను తెలుసుకునే పరిస్థితి వస్తుంది.
ఒక పవిత్రమైన దీపం, దాని వెనుక ఉన్న విలువైన సంపద, దానిని దక్కించుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు.. ఇలా కథలో అనేక ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి.మూడు తరాలకు చెందిన ఈ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ నిధిని కాపాడేందుకు వారు చేసిన పోరాటం ఎలాంటిది? చివరకు ఆ సంపద ఎవరికి దక్కింది? అనేది సినిమాలో చూడాలి.ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఎవరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
