
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని అన్నప్రసాద పోటు (వంటశాల)లో లడ్డూలు, ప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రసాదాల తయారీ సమయంలో కాగుతున్న నెయ్యి ఒలికిపడటం, గ్యాస్ లీకై సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి.
భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం, ఎవరూ గాయపడక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

.ప్రమాద ఆలయ ఈవో బి.కె. వెంకటేశులు పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు ఈ సందర్భంగా మరిచినట్లున్నారే!!
[Fireaccident, Srikalahasti, Annaprasadapotu, HugeFire, TeluguOne]
