Home Latest News ప్రధాని టీ తాగిన కప్పు దేవుడి మందిరంలో: రికవరీ ఏజెంట్లు గుమ్మంలో.. దయనీయంగా మీరా మాఝీ కుటుంబం.! | మోడీ పర్యటన తర్వాత చిక్కుల్లో పడిన మీరా మాఝీ కుటుంబం | అయోధ్య | ప్రధాని మోదీ టీ అతిథి | PMEGP లోన్ రికవరీ | ఆర్థిక పోరాటం – Andhra Waves

ప్రధాని టీ తాగిన కప్పు దేవుడి మందిరంలో: రికవరీ ఏజెంట్లు గుమ్మంలో.. దయనీయంగా మీరా మాఝీ కుటుంబం.! | మోడీ పర్యటన తర్వాత చిక్కుల్లో పడిన మీరా మాఝీ కుటుంబం | అయోధ్య | ప్రధాని మోదీ టీ అతిథి | PMEGP లోన్ రికవరీ | ఆర్థిక పోరాటం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ స్దయంగా వారి ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు మీరా మాఝీ స్వయంగా తయారు చేసి ఇచ్చిన టీ తాగారు. ఆమె తయారు చేసిన రుచిని పొగిడారు. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా వారి అర్హతను బట్టి అన్ని పథకాలూ అందిస్తానని హామీ ఇచ్చారు.

దేశ ప్రధాని స్వయంగా తమ ఇంటికి వచ్చి తేనీరు తాగి యోగక్షేమాలు అడగడం, బాధలు తీరుతాయనీ, పథకాలు వస్తాయనీ హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. ఆయన టీ తాగిన కప్పును భద్రంగా, ఒక మాన్యుమెంట్ గా దాచుకుంది మీరా మాఝీ.

ఇక ప్రస్తుతానికి వస్తే.. మీరా మాఝీ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. వారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రధాని మోడీ వారి ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లడమే. ఔను నిజమే.. ఆ కారణంగానే వారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

అందుక వారి అమాయకత్వం, అవిద్య కూడా ఒక కారణమనుకోండి. అది వేరే సంగతి. ఇంతకూ మోడీ రాకకు, వారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమవ్వడానికీ లింకేమిటంటారా?.. ఆ విషయం తెలియాలంటే, మోడీ రాక, ఆ తరువాత పరిణామాల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఆ వివరాల్లోకి వెడితే..

ఇది చదవండి: అద్వానీ ప్రస్థానం అసాధారణం.. మోదీ సేవను చేసుకున్న ప్రధాని.!

2023 డిసెంబర్ 30న అయోధ్యలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చెందిన మీరా మాఝీ ఇంటికి వెళ్లి ఆమె తయారు చేసి టీ తాగి వారితో ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని టీ తాగిన కప్పును ఆ కుటుంబం ఇప్పటికీ పూజ గదిలో భద్రంగా కాపాడుకుంటుంది. ఈ విషయం ముందే చెప్పుకున్నాం కదా.. ఆ తరువాత ఆ కుటుంబానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ మంజూరయ్యయ్య. మోడీ తమ ఇంటికి రావడం వల్లే ఆ ఇద్దరూ మీకు వచ్చారని మీరా మాఝీ కుటుంబం మురిసిపోయింది. . ఇక మీరా మాఝీ భర్త సూరజ్ కుమార్ మాఝీ సరయు నదిలో పడవ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. మోడీ వచ్చి వెళ్లిన తరువాత అధికారులు పీఎంఈజీపీ కింద మీరా మాటీ కుటుంబానికి రెండు రుణాలు ఇచ్చారు. స్థానిక అధికారి ఒకరు మీరా మాఝీ భర్త చేత బిజినెస్ పెట్టడానికి కూడా చెప్పారు. దీనితో వారు ఆర్థిక సాయంగా భావించారు. అంతే తప్ప అది రుణం అని వారికి తెలియదు. ఆ తరువాత.. రుణం బకాయిలు చెల్లించాలంటూ నోటీసుల మీద నోటీసులు రావడం. ఒత్తిడి పెరిగింది.

ఇప్పుడు మీరా మాఝీ కుటుంబం ఏమంటోందంటే.. మోడీ మా ఇంటికి రాకుండా ఉన్నా బాగుండేదని. ఆయన రాక ముందు తమ పరిస్థితి ఎంతో బాగుండేదనీ మీరా మాఝీ చెప్పారు. ఆయన వచ్చిన తరువాత తనకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. అధికారులు అనవసర ఆర్భాటంతో తాము అడగకుండా, ఇస్తున్నది రుణం అని కూడా చెప్పకుండా సొమ్ములిచ్చి, ఇప్పుడు అప్పు తీరుస్తారా, ఛస్తారా అంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటికి వచ్చి వెళితే మేలు జరుగుతుందనుకున్నాం, కానీ ఇలా ఇక్కట్లు, ఇబ్బందుల పాలౌతామని అనుకోలేదని మీరా మాఝీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ జీరోయే: గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయ దైన్యానికి దర్పణం.!

మతి ఉండేలా చేస్తున్నారా: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం ఫైర్.!

[Meera Majhi Family in Trouble After Modi Visit, Ayodhya, PM Modi Tea Guest, PMEGP Loan Recovery, Financial Struggle, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird