Home Latest News మోడీ చేతుల మీదుగా ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ : ఫిబ్రవరి 3న ముహూర్తం ఖరారు.! | క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ అమరావతి క్వాంటం వ్యాలీ | ప్రధాని మోదీ | ఫిబ్రవరి 3, 2027 | CBN | క్యాబినెట్ – Andhra Waves

మోడీ చేతుల మీదుగా ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ : ఫిబ్రవరి 3న ముహూర్తం ఖరారు.! | క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ అమరావతి క్వాంటం వ్యాలీ | ప్రధాని మోదీ | ఫిబ్రవరి 3, 2027 | CBN | క్యాబినెట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రతిష్టాత్మక ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

ఈ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో (కేబినెట్ భేటీ) అధికారికంగా ఏర్పాటు చేశారు. 2027 ఫిబ్రవరి 3వ తేదీన ఈ ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభోత్సవం జరగనుందని ఆయన కేబినెట్ సభ్యులకు వివరించారు.

ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ క్వాంటమ్ కంప్యూటర్‌ను ప్రారంభించేలా ముహూర్తం ఖరారైందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులను పరిశీలించారు.

అమరావతిలో ప్రాజెక్టు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్ర ఐటీ, సాంకేతిక రంగానికి సరికొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. అత్యాధునిక పరిశోధనలు, సమాచార విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్ మరియు ఏఐ సాంకేతికత అభివృద్ధికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు

గ్లోబల్ టెక్ దిగ్గజమైన ఐబీఎం భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ సెంటర్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, నిపుణులైన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధానిని ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ క్వాంటంటమ్ సెంటర్ నిదర్శనంగా నిలవనుంది.

ఐటీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతను ప్రపంచ పటంలో నిలిపేలా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ప్రారంభోత్సవానికి సంబంధించిన రక్షణ, పరిపాలనాపరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయడంతో పాటు, గ్లోబల్ టెక్ ప్రతినిధులను కూడా ఆహ్వానించే దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. అమరావతి రాజధానిని ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ క్వాంటమ్ సెంటర్ నిదర్శనంగా నిలవనుంది.

మీకు నచ్చవచ్చు: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. వచ్చే ఏడాది జనవరికల్లా రెడీ

తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

[Unveiling Quantum Computer Amaravati Quantum Valley, PM Modi, Febraury 3rd 2027, CBN, Cabinet, IBM Quantum Computer AP Technology Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird