Home సినిమా ఆమెలాంటి సీత వెతికినా దొరకదు – iDreamPost – Andhra Waves

ఆమెలాంటి సీత వెతికినా దొరకదు – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఆమెలాంటి సీత వెతికినా దొరకదు - iDreamPost


ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి రామాయణ సినిమాలో సీత పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆమె సీత పాత్రపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రామాయణ సినిమాకు సాయి పల్లవి మైనస్ అయిందన్న ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ ట్రోలింగ్స్‌పై హీరో ధనుష్ స్పందించారు. ఓం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో.. సీతగా సాయి పల్లవి నటనపై, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రశంసల జల్లు కురిపించారు.

ధనుష్ మాట్లాడుతూ.. ”రామాయణంలో ఆమె సీతగా నటించడంపై ఎందుకు అంత చర్చ జరుగుతుందో, ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. షూటింగ్ బ్రేక్‌ల సమయంలో కూడా ఆమె నిరంతరం దేవుడిని ప్రార్థిస్తూ ఉండేది. మీరు భారతదేశం మొత్తం వెతికినా సరే, సీత పాత్రకు ఆమెకంటే పవిత్రమైన మనసున్న, భక్తిభావం ఉన్న నటిని కనుక్కోలేరు. ఆమె ఎంతో అందంగా కనిపించడమే కాకుండా, అద్భుతంగా నటించింది.

తొమ్మిదేళ్ల క్రితం ‘మారి 2’ సినిమా సమయంలో నేను సాయి పల్లవిని మొదటిసారి కలిసినప్పుడు ఆమె చాలా అమాయకంగా ఉండేది. చాలా తక్కువగా మాట్లాడేది. కానీ ఇప్పుడు ‘ఓఎం’ సినిమా సెట్స్‌లో ఆమెను చూసి నేను ఆశ్చర్యపోయాను. సినిమా రంగంపై పూర్తి పట్టు సాధించిన ఒక పరిణతి చెందిన నటి ఆమె నిలబడింది. ఆమె నడక, మాటతీరు, హావభావాలలో కొండంత ఆత్మవిశ్వాసం కనిపించింది” అంటూ సాయి పల్లవిపై ప్రశంసల జల్లు కురిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird