Home Latest News అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్ పాలనపై రిఫరెండం: మర్పు కోరుకుంటున్న అమెరికన్లు.! | US మధ్యంతర ఎన్నికలు | డొనాల్డ్ ట్రంప్ ఓటమి | ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్‌ను గెలిపించారు | US రాజకీయ నవీకరణలు | అంతర్జాతీయ వార్తలు – Andhra Waves

అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్ పాలనపై రిఫరెండం: మర్పు కోరుకుంటున్న అమెరికన్లు.! | US మధ్యంతర ఎన్నికలు | డొనాల్డ్ ట్రంప్ ఓటమి | ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్‌ను గెలిపించారు | US రాజకీయ నవీకరణలు | అంతర్జాతీయ వార్తలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం చవిచూడగా, డెమోక్రాట్ పార్టీ అఖండ విజయం సాధించింది. అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలపై డెమోక్రాట్లు పట్టు సాధించడం అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు నిస్సందేహంగా ఎదురుదెబ్బే. ఈ ఎన్నికలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనపై రిఫరెండంగా భావించారు. అయితే, ట్రంప్ అనుసరించిన విధానాలు, నిర్ణయాలు, పెరుగుతున్న దేశీయ సమస్యలపై ప్రజలు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో విస్పష్టంగా వ్యక్తపరిచారు.

ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్ పాలనా కాలంలో ఎదుర్కొన్న అత్యంత పెద్ద రాజకీయ ఎదురు దెబ్బగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డెమోక్రాట్లు తమ సాంప్రదాయ బలమైన రాష్ట్రాలైన కొలరాడో, ఒరెగాన్, ఇల్లినాయిస్‌లలో విజయాలు సాధించడమే కాకుండా, జార్జియా, మిషిగన్, వర్జీనియా వంటి కీలక స్వింగ్ స్టేట్స్‌ను కూడా నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా, రిపబ్లికన్ పార్టీకి గట్టి పట్టు ఉన్న టెక్సాస్, కాన్సాస్, అయోవా వంటి రాష్ట్రాల్లోనూ చారిత్రక విజయాలు నమోదు చేయబడ్డాయి. ముఖ్యంగా టెక్సాస్‌లో దశాబ్దాల తర్వాత డెమోక్రాట్లు ఒక సెట్ కోసం కైవసం చేయడం విశేషం.

ట్రంప్ ఇంతకు ముందు రెండుసార్లు అభిశంసనలను, అనేక విచారణలను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పటికీ, ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మధ్య ఎన్నికల పరీక్షలో మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యం ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడం, సామాన్య ప్రజల జీవన వ్యయం భారంగా మారడం రిపబ్లికన్లకు పెద్ద మైనస్ గా మారింది.

విదేశాంగ విధానాల పరంగా కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌తో జరిగిన ఘర్షణలు, గాజాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయంగానే కాదకు దేశీయంగా కూడా ట్రంప్ పై వ్యతిరేకత వెల్లువెత్తడానికి కారణమయ్యాయి. అలాగే కఠిన వలస విధానాల పేరుతో వలసదారులను, ముఖ్యంగా ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ కు వలసదారుల చేతులకు బేడీలు వేసి అమానుషంగా తరలించడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన లాటినో ఓటర్లు ఈసారి రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి: ట్రంప్ విధానాల ఫలితమేనన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.!

ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అమెరికాలో మారుతున్న సామాజిక, రాజకీయ సమీకరణలను తేటతెల్లం చేస్తున్నాయి. సంప్రదాయవాద, మతపరమైన రాజకీయాలకు భిన్నంగా సమ్మిళిత నాయకత్వం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నందుకు నిదర్శనంగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. న్యూయార్క్ మేయర్‌గా మందానీ బాధ్యతలు చేపట్టడం, అలాగే కేరళ మూలాలున్న నిత్య రామన్ లాస్‌ఏంజెల్స్ మేయర్‌గా విజయం సాధించడం వంటి పరిణామాలు అమెరికా రాజకీయాల్లో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. విదేశీ మూలాలున్న నాయకులు ఉన్నత పదవులను అధిరోహించడం ప్రవాస భారతీయులకు గర్వకారణంగా మారింది.

రాబోయే కాలంలో అధ్యక్షుడు ట్రంప్ తన రాజకీయ ప్రయాణంలో మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల అధికారం పెరుగుతుందని, ట్రంప్ తన నిర్ణయాలను ఆమోదించుకోవడానికి వీటో అధికారాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా పౌరులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు. రాబోయే అధ్యక్ష ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలకనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు: అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.!

[US Midterm Elections, Donald Trump defeat, Democrats win Congress, US political updates, International News, TeluguOne News]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird