Home సినిమా ఈ7 జిల్లాలకు మురసు ముప్పు! – iDreamPost – Andhra Waves

ఈ7 జిల్లాలకు మురసు ముప్పు! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈ7 జిల్లాలకు మురసు ముప్పు! - iDreamPost


ఆంధ్రప్రదేశ్‌ను మురసు తుఫాన్ వణికిస్తోంది. అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. మురసు తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మురసు తుఫాన్ ప్రభావంతో నవంబర్ 3న బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.నవంబర్ 4న కూడా పలు ప్రాంతాల్లో కొనసాగే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ తీవ్ర తుపానుగా బలపడింది. నవంబర్ 3 తెల్లవారుజామున నెల్లూరు నుంచి నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో గంటకు 100 నుంచి 110 నిమిషాల వేగంతో వీచే అవకాశం ఉంది, గరిష్ఠంగా 120 వేగంతో ఈదురుగాలులు వీయడానికి ఐఎండీ హెచ్చరించింది. తీరాన్ని దాటిన తర్వాత తుఫాన్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు, బలమైన గాలులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల ప్రజల వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ ఇచ్చే తాజా సూచనలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రచయిత అవతార్

శ్వేత

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird