Home Latest News కర్ణాటక స్టింగ్ ఆపరేషన్ కలకలం: కుమారస్వామికి బిగుస్తున్న ఉచ్చు.! | కర్ణాటక స్టింగ్ ఆపరేషన్ వివాదం | హెచ్‌డి కుమారస్వామి | కర్ణాటక | స్టింగ్ వీడియో | కేంద్ర మంత్రి కుమారస్వామి | నివాసం | రితేష్ పాండే | వినోద్ శర్మ – Andhra Waves

కర్ణాటక స్టింగ్ ఆపరేషన్ కలకలం: కుమారస్వామికి బిగుస్తున్న ఉచ్చు.! | కర్ణాటక స్టింగ్ ఆపరేషన్ వివాదం | హెచ్‌డి కుమారస్వామి | కర్ణాటక | స్టింగ్ వీడియో | కేంద్ర మంత్రి కుమారస్వామి | నివాసం | రితేష్ పాండే | వినోద్ శర్మ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


కర్ణాటక రాజకీయాలలో పెను సంచలనంగా మారిన స్టింగ్ ఆపరేషన్ ఉదంతం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఒక మొబైల్ ఫోన్ లింకులు నేరుగా కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి వరకూ వెళ్లాయి.

బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రితేష్ పాండే విచారణ సమయంలో కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీలోని కరోల్ బ్యాగ్ మార్కెట్‌లో వినోద్ శర్మతో కలిసి తాను ఒక మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. కుమారస్వామి సోషల్ మీడియా బృందంతో సంబంధం ఉన్న ప్రజ్వల్ ప్రసాద్ సూచనల మేరకే తాను ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు రితీష్ పాండే విచారణలో అంగీకరించారు.

ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం రితేష్ పాండే, వినోద్ శర్మ ఇద్దరూ నేరుగా ఢిల్లీలోని కుశక్ రోడ్‌లో ఉన్న కుమారస్వామి అధికారిక నివాసానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ ఆ మొబైల్ ఫోన్‌ను నేరుగా ప్రజ్వల్ ప్రసాద్‌కు అందజేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఈ వివరాలన్నీ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తెలిశాయనీ, వీటిని స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉందని బెంగళూరు పోలీసు కమిషనర్. ఈ ఫోన్ మార్పిడి వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రజ్వల్ ప్రసాద్‌తో పాటు వినోద్ శర్మకు పోలీసులు జారీ చేశారు. అయినప్పటికీ, నిందితులు ఇద్దరూ ఇప్పటివరకు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకాలేదు. అదనంగా, వారు ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడు రితేష్ పాండే చెప్పిన అంశాలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

మరోవైపు, ఈ స్టింగ్ వీడియోనుఎలా రికార్డు చేశారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో దీన్ని ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఒరిజినల్ ఫుటేజ్‌ను రికార్డు చేయడానికి ఉపయోగించారనే అనుమానం ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అలాగే.. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి పూర్తిగా వేరొక ఫోన్‌ను ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.


[Karnataka Sting Operation Controversy, HD Kumaraswamy, Karnataka, Sting Video, Union Minister Kumaraswamy, Residence, Ritesh Pandey, Vinod Sharma, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird