భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు లేడీ ఫాలోయింగ్ ఎంత ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా ఈ అత్యుత్తమ విధ్వంసకర ఓపెనర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్వా చౌత్ సందర్భంగా ఓ మహిళా అభిమాని చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్వా చౌత్ పండుగను పురస్కరించుకుని వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, దాంపత్య సుఖం కోసం ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటించి, రాత్రి చంద్రుడిని దర్శించుకున్న తర్వాత పూజలు చేసి ఉపవాసాన్ని విరమించుకోవడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం.
అయితే, అభిషేక్ శర్మకు చెందిన ఓ మహిళా అభిమాని ఈ సంప్రదాయానికి క్రికెట్ టచ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆమె తన మొబైల్ ఫోన్లో ఉన్న అభిషేక్ శర్మ ఫొటోను పట్టుకుని కర్వా చౌత్ ఆచారాలను పాటిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా జల్లెడలోంచి చంద్రుడిని చూస్తే ఆచారాన్ని అనుసరించే ఆమె.. అభిషేక్ ఫొటోను కూడా జల్లెడలోంచి చూసి, అర్ఘ్యం సమర్పించింది.ఈ దృశ్యాలు నెటిజన్ల కంట పడ్డాయి. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లపై చూపించే ప్రేమకు ఇది విచిత్రమైన ఉదాహరణగా చాలా కామెంట్స్ చేస్తున్నారు.
సంప్రదాయ పండుగలో ఒక క్రికెటర్ ఫొటోను భాగం చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ర్ఘ్యం అంటే గౌరవ సూచకంగా దేవతలకు లేదా చంద్రుడికి నీటిని సమర్పించే సంప్రదాయ ఆచారం. కర్వా చౌత్ సందర్భంగా చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత చాలామంది మహిళలు ఉపవాసాన్ని విరమిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా మూడో టీ20లో 38 బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ గా దూసుకొచ్చాడు.
The post చంద్రుడికి బదులు అభిషేక్ ఫొటోకా.. appeared first on iDreamPost.
