ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తన కోచింగ్ విభాగాన్ని స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. కొత్త సీజన్ కోసం తమ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేపడుతున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించిన సీఎస్కే, గారెత్ బ్యాటీకి కూడా అదే బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, భారత మాజీ పేసర్ మోహిత్ శర్మను బౌలింగ్ కోచ్‌గా నియమించారు. ఇప్పటికే జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన తర్వాత ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆల్బీ మోర్కెల్‌కు ఎస్ఎస్కేతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచే చెన్నై జట్టుతో ప్రయాణం ప్రారంభించిన మోర్కెల్ .. 2008 నుంచి 2013 వరకు ఫ్రాంచైజీకి ప్రాబల్యం వహించాడు. ఈ సమయంలో 92 మ్యాచ్‌లు ఆడి, 2011, 2013 సీజన్లలో సీఎస్కే టైటిళ్లు గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆటగాడిగా చెన్నైతో అనుబంధం కలిగిన మోర్కెల్ ఇప్పుడు కోచ్‌గా తిరిగి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మోర్కెల్ స్పందించారు.
సూపర్ కింగ్స్ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన బంధం ఉందని అన్నాడు. చెపాక్‌లో అభిమానుల కేరింతలు, ఈల శబ్దం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపాడు. సీఎస్కేతో మైదానంలో, బయట ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. యువకులతో తనని పంచుకోవడానికి ఆసక్తిగా అనుభవాలు వెల్లడించాడు. అదనంగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా అతనికి ఉంది.
ఇక మోహిత్ శర్మ నియామకం కూడా ఎస్ఎస్కే బౌలింగ్ అవసరం కీలకంగా మారనుంది. గతంలో చెన్నై నుంచి ఐపీ ఆడిన అతడు, తన ఎల్ కెరీర్‌ను ఇదే చైజీతో ప్రారంభించాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ కూడా ఆడి, బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ గెలుచుకోవడం, 2014 ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్ సాధించడం తన కెరీర్లో ప్రత్యేక జ్ఞాపకాలుగా మోహిత్ చెప్పుకొచ్చాడు.
The post CSK కోచింగ్ స్టాఫ్‌లో మాజీ స్టార్స్.. appeared first on iDreamPost.
