Home క్రైమ్ Vijay Government: విజయ్ ప్రభుత్వానికి కఠిన సవాల్.. రాష్ట్రాన్ని – Andhra Waves

Vijay Government: విజయ్ ప్రభుత్వానికి కఠిన సవాల్.. రాష్ట్రాన్ని – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


విజయ్ ప్రభుత్వం: ఆ ఇల్లు మొత్తం సందడిగా ఉంది. బంధువులు.. కుటుంబ సభ్యులు హడావిడి చేస్తున్నారు. అంతటి ఉత్సాహం మధ్య ఆ బాలిక తన ఏడవ పుట్టినరోజు జరుపుకుంది. రాత్రి తన తల్లి పక్కన నిద్రపోయింది. తెల్లవారి చూసేసరికి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికారు. బావులు, చెరువులు, పొలాలు కొండ ప్రాంతాలు మొత్తం గాలించారు. వందల ఫోన్ నెంబర్లు పరిశీలించారు. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చివరకు ఈ కేసును CB CID […]

విజయ్ ప్రభుత్వం: ఆ ఇల్లు మొత్తం సందడిగా ఉంది. బంధువులు.. కుటుంబ సభ్యులు హడావిడి చేస్తున్నారు. అంతటి ఉత్సాహం మధ్య ఆ బాలిక తన ఏడవ పుట్టినరోజు జరుపుకుంది. రాత్రి తన తల్లి పక్కన నిద్రపోయింది. తెల్లవారి చూసేసరికి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికారు. బావులు, చెరువులు, పొలాలు కొండ ప్రాంతాలు మొత్తం గాలించారు. వందల ఫోన్ నెంబర్లు పరిశీలించారు. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చివరకు ఈ కేసును CB CID కి అప్పగించడంతో మిస్టరీ మరింత పెరిగింది. ఈ చిన్నారి అదృశ్యం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో సంజీ సమీపంలోని అలంపుడి ప్రాంతంలో జరిగింది. హేమలత అనే బాలిక ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. అక్టోబర్ 11న కుటుంబ సభ్యులు ఆమె ఏడవ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి నిద్రపోయింది. అక్టోబర్ 12న తెల్లవారుజామున కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ చిన్నారి ఎటు వెళ్ళింది.. ఇంటి నుంచి బయటకు వెళ్లిందా.. లేదా ఎవరైనా తీసుకెళ్లారా.. ఇంకా ఏదైనా ఘోరం జరిగిందా.. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు లభించలేదు. స్థానిక పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఆ గ్రామంలో గృహాలు.. వ్యవసాయ పొలాలు.. బావులు.. చెరువులు.. కొండ ప్రాంతాల్లో పోలీసులు గాలించారు. చివరికి స్నిఫర్ డాగ్స్ సహాయంతో తనిఖీలు జరిగాయి..

దర్యాప్తులో భాగంగా జరిగిన ఘటన రాత్రి.. తెల్లవారుజామున ఈ ప్రాంతంలోని మొబైల్ టవర్ల పరిధిలో నమోదైన సుమారు 600 అనుమానాస్పద రికార్డు కాల్‌లను పరిశీలించారు. గ్రామం నుంచి బయటికి వెళ్లే మార్గాలలోని కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కుటుంబ సభ్యులు.. బంధువులు.. పొరుగు వారిని ప్రశ్నించారు. అయినప్పటికీ కేసులో కీలకమైన ఆధారం లభించలేదు.

స్థానిక పోలీసుల దర్యాప్తులో లేకపోవడంతో తమిళనాడు డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ అక్టోబర్ 21న ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ సీఐడీకి బదిలీ చేశారు. అక్టోబర్ 22 నుంచి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సీబీసీఐడీ రంగ ప్రవేశం చేయడంతో కొత్త ఆధారాలు లభిస్తాయని స్థానికులు భావించారు. చిన్నారి ఇంటి పరిసరాలను మరోసారి అధికారులు పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులను విచారించారు. గతంలో పరిశీలించిన తర్వాత మళ్లీ పరిశీలించారు.

హేమలత అక్కకు వివాహం నిశ్చయమైంది. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా అధికారులు విచారిస్తున్నారు. పుట్టినరోజు నాడు చిన్నారికి తీసుకొచ్చిన వ్యక్తి నుంచి కూడా వివరాలు సేకరించారు. చిన్నారిని ఎవరైనా అపహరించారా.. ఆమెను మరో తీసుకెళ్ళారా.. కుటుంబానికి తెలిసిన వారి ప్రమేయం ఏదైనా ఉందా.. అనే కోణాలలో దర్యాప్తు సాగుతోంది.

ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. ఒక చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన ఇప్పుడు కుటుంబానికి పరిమితమైన సమస్యగా లేదు. ఏపీలో కూడా తుని ప్రాంతంలో ఒక బాలిక ఇలానే తప్పిపోయింది. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించలేదు. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ బాలిక ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే ఈ కేసులో కీలక ఆధారాలు ఏంటి.. ఫోన్ కాల్స్.. సీటీవీ దృశ్యాలు ఏదైనా కొత్త పురోగతిని చూపిస్తాయా.. సి బి సి ఐ డి విచారణలతో చిన్నారి ఆచూకీ లభిస్తుందా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird