Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్: జగన్ వెళ్ళిపోతే.. సజ్జలకేనా.. – Andhra Waves

వైఎస్ జగన్: జగన్ వెళ్ళిపోతే.. సజ్జలకేనా.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



జగన్ బహిరంగ సభ అప్ డేట్

వైఎస్ జగన్: జగన్ విదేశాలకు వెళ్లిపోతారు.. నవంబర్ నెలలో ఏదో ఒక వారంలో ఆయన కుటుంబంతో కలిసి యూరప్ పర్యటన చేస్తారు.. ఇదీ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైసిపి నాయకులు చేస్తున్న ప్రచారం.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుటుంబంతో కలిసి జగన్ లండన్‌లో నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఆయన విదేశాల్లో బయటికి వెళ్లిన ఫోటోలు కొన్ని మాత్రమే బయటికి వచ్చాయి.

అధికారం కోల్పోయిన తర్వాత.. అది కూడా స్థానిక ఎన్నికల ముందు జగన్ విదేశాలకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అక్రమ కేసు విచారణ నేపథ్యంలో.. జగన్ సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నారని. స్థానిక ఎన్నికల ముందు జగన్ విదేశాలకు వెళ్లిపోతే పార్టీలో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కార్యకర్తలు అంటున్నారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి దూకుడు మీద ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగితే వార్ వన్ సైడ్ కావడం ఖాయమని.. సాక్షాత్తు వైసిపి కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. చేతిలో ఛానల్.. పేపర్ ఉంది కాబట్టి వైసిపి ఏదో ఒక రకంగా సానుభూతి కోసం వార్తలను ప్రచారం, ప్రసారం చేస్తోంది. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదని టిడిపి కార్యకర్తలు చెబుతున్నారు.

ఒకవేళ జగన్ విదేశాలకు వెళ్ళిపోతే అప్పుడు పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు? అనే చర్చ నడుస్తోంది. అంబటి రాంబాబుకు ఇచ్చే అవకాశం లేదు. బొచ్చ సత్యనారాయణకు అప్పగించే సాహసం జగన్ చేయరు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకల శాఖా మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సజ్జల మీద బోరుగడ్డ అనిల్.. ఇంకా అనేకమంది ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి కూడా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ సజ్జల మీద జగన్ చర్యలు తీసుకోలేదు. సజ్జలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి జగన్ బయటకి పంపించారు.

ఇక ఈ నెలలోనే షర్మిల కూతురి వివాహం ఉంది. యలహంక ప్యాలెస్ లోనే చేయాలని ఆమె అనుకుంటున్నారు. అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ షర్మిల కూతురు వివాహానికి ముందు విదేశాలకు వెళ్తారా.. వివాహం తర్వాత వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే వచ్చే నెలలో కుటుంబంతో కలిసి జగన్ విదేశీ యాత్రకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird