Home తెలంగాణ KTR: కే రామ్, రామ్ కేటీ అని కేటీఆర్ పేర్లు ఎందుకు మార్చు – Andhra Waves

KTR: కే రామ్, రామ్ కేటీ అని కేటీఆర్ పేర్లు ఎందుకు మార్చు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


కేటీఆర్: మొన్నటిదాకా కేటీఆర్ జుట్టు గురించి.. ఆ తర్వాత గడ్డం గురించి.. మీసం గురించి కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సోమవారం గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకట్ మాట్లాడిన మాటల్లో కేటీఆర్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా విదేశాలకు వెళ్లేవారట ముఖ్యంగా ప్రైవేట్ జెట్ లో ఆయన ప్రయాణం చేసేవారట. ఢిల్లీ వయా బొంబాయి వెళ్లేవారట. ఆయన అలా ప్రయాణం చేస్తున్నప్పుడు వెంట మహిళా ప్రముఖులు ఉండేవారట. ఈ పరీక్ష బయటకు తెలియకుండా కేటీఆర్ జాగ్రత్త పడ్డారట. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు కే రామ్, రామ్ కేటీ అని మారు పేర్లతో ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేశారట..

కేవలం ఈ ఆరోపణలకే వెంకట్ పరిమితం కాలేదు. కేటీఆర్ ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వెంట ఉన్న హీరోయిన్లు ఎవరు అని వెంకట్ ప్రశ్నించారు. హీరోయిన్ల ఉసురు కేటీఆర్ కు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. తన భార్య శైలికి అబద్ధాలు చెప్పి ఆయన ట్రావెల్ చేశారట. ఒకవేళ తాను చెప్పిన మాటలు నిజం కాకపోతే.. తన కుమారుడు హిమాన్షు మీద ఒట్టు వేసి అబద్దాలను చెప్పాలని వెంకట్ సవాల్ విసిరారు.

ఇటీవల ఒక భూ వివాదంలో వెంకట్ కలగజేసుకున్నారని.. ఆయన మనుషులపై దాడి చేశారని గులాబీ పార్టీ మీడియాలో.. సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. వార్తలు కూడా ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అదును కోసం వెంకట్ ఏకంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మరి చూపించారు గులాబీ పార్టీ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇచ్చారు.. కేటీఆర్ ఏ రెస్పాండ్ అవతరించారు.

తనకు వ్యతిరేకంగా.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తే.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు న్యాయస్థానం దాకా వెళ్తున్నారు. పరువు నష్టం దావా వేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్ మీద కేటీఆర్ కోర్టు వరకు వెళ్తారా.. పరువు నష్టం దావా వేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు విధానపరంగా కాకుండా.. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం.. తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird