త్రిష కృష్ణన్: ఇది ఓపెన్ సీక్రెటే.. విజయ్ దాచాలి అనుకోవడం లేదు. ఆ నటి రహస్యంగా ఉంచాలి అనుకోవడం లేదు.. మొత్తానికి ఇద్దరు బయటపడుతున్నారు. విజయ్ తన భార్యతో అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అలాగని త్రిషకు దూరంగా ఉండటం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో ఇద్దరు తమ రిలేషన్ ను బయట పెట్టుకుంటూనే ఉన్నారు. విజయ్ జీవితంలో త్రిషకు ఎటువంటి స్థానం ఉందో అందరికీ తెలుసు. మరి రియల్ లైఫ్ లో […]
త్రిష కృష్ణన్: ఇది ఓపెన్ సీక్రెటే.. విజయ్ దాచాలి అనుకోవడం లేదు. ఆ నటి రహస్యంగా ఉంచాలి అనుకోవడం లేదు.. మొత్తానికి ఇద్దరు బయటపడుతున్నారు. విజయ్ తన భార్యతో అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అలాగని త్రిషకు దూరంగా ఉండటం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో ఇద్దరు తమ రిలేషన్ ను బయట పెట్టుకుంటూనే ఉన్నారు. విజయ్ జీవితంలో త్రిషకు ఎటువంటి స్థానం ఉందో అందరికీ తెలుసు. మరి రియల్ లైఫ్ లో ఆమె పాత్ర ఏంటి.. ఆమెకు అలాంటి స్థాయి లభిస్తుంది.. ఈ ప్రశ్నలకు త్రిషనే సమాధానం చెప్పింది.
సాధారణంగా సినిమా తారలు షాపింగ్ మాల్స్.. జువెలరీ షోరూంలు.. మొబైల్ దుకాణాలు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావడం కొత్తది కాదు. అయితే ఇటువంటి కార్యక్రమాలకు పేరు పొందిన తారలు హాజరైతే.. త్రిష కోయంబత్తూర్ ప్రాంతంలో ఓ మొబైల్ షాప్ ఓపెనింగ్‌కు సూచన. ఆ సమయంలో అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పెట్టారు. ఆమె చేసిన సందడి ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో.. విపరీతమైన చర్చకు కారణం అవుతోంది. తమిళనాడులో త్రిష కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది.
కోయంబత్తూర్ ప్రాంతంలో మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి త్రిష ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. కారు సన్ రూఫ్ నుంచి.. బయటికి వచ్చి.. అభిమానులకు అభివాదం చేశారు.
త్రిషకు తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోయంబత్తూరు ప్రాంతంలో జరిగిన ఆమె వచ్చిన తీరు కూడా తమిళనాడు రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీసింది.. అయితే ఆమె వచ్చినప్పుడు జనం ఆ స్థాయిలో హాజరు కావడం పట్ల రకరకాల చర్చలు సాగుతున్నాయి. అందుకే ఈ స్థాయిలో ఆమె తన జన బలాన్ని చూపించుకుంటున్నారని తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ వెంట ప్రత్యక్షంగా.. పరోక్షంగా త్రిష కనిపించారు. ఇటీవల విదేశాలలో ఒక హాజరైనప్పుడు త్రిష విజయ్ వెంట ఉన్నారు. దీనిని బట్టి విజయ్ ఆమె పొలిటికల్ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
