Home Latest News వాయు కాలుష్యం: సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.! | ప్రజారోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం | ఆరోగ్య సమస్యలు | వాయు కాలుష్యం భారతదేశం | ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం | కాలుష్య నివారణ – Andhra Waves

వాయు కాలుష్యం: సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.! | ప్రజారోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం | ఆరోగ్య సమస్యలు | వాయు కాలుష్యం భారతదేశం | ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం | కాలుష్య నివారణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


మనిషికి ప్రాణాధారం గాలి. అటువంటి గాలి విషపూరితమైతే.. మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో పెరిగి.. మనిషి జీవన్మరణ సమస్యలతో సమతమౌతున్నాడు. ప్రతి శ్వాస ఆరోగ్యానికి ముప్పుగా మారుతూ.. మానవ జీవితం వైపు తరుముతున్న పరిస్థితి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో వాయు కాలుష్యానిదే సింహభాగం. వాయు కాలుష్యం పర్యావరణతను దెబ్బతీయడంతో ఆగదు.. అది మనిషికి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా ప్రతి అవయవం పని తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కండరాలు సహా అనేక అవయవాలపై ప్రభావం చూపుతోంది.

ఎఫెక్ట్స్ ఇన్ హెల్త్, యూనిసెఫ్ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్‌–2024 నివేదిక ప్రకారం 221లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 81 లక్షలు. వాయుకాలుష్య సంబంధిత మరణాలలో ఇండియా టాప్ లో ఉంది. భారత్‌లో 2021లో వాయు కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 21 లక్షల పైచిలుకు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశమంటే.. వాయు కాలుష్యం అంటే.. నగరాలు, పట్టణాల్లో కనిపించే పొగమంచు మాత్రమే కాదు.. అది మనిషి ఆయుర్దాయాన్ని హరించేస్తే కాలకూట విషయం.

స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషితమైన టాప్ 20 నగరాలలో 13 ఇండియాలోనే ఉన్నాయి. ఆ జాబితాలో టాప్ ప్లేస్‌లో అసోంలోని బైర్నిహాట్‌ నిలిచింది. అక్కడ వాయు కాలుష్యం సగటున పీఎం 2.5 స్థాయులో నమోదైంది. దేశ రాజధాని హస్తినలో కూడా వాయు కాలుష్యం ఆందఓళనకర స్థాయిలో కనిపిస్తుంది.. ఈ జాబితాలో టాప్ 20లో లేదు.

ఇక విషయానికి వస్తే.. పీఎమ్ 2.5 అంటే అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు. ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెడతాయి. కొన్ని కణాల రక్తప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వీటి ముప్పు సాధారణ దుమ్ముతో కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. అది పక్కన పెడితే కాలుష్య స్థాయులు కాలానుగుణంగా మారుతుంటాయి. ఒక సంవత్సరం జాబితాను ప్రస్తుత పరిస్థితికి యథాతథంగా అన్వయించడం సరికాదు. టాప్ 20 జాబితాలో లేనంత మాత్రాన ఆ జాబితాలో లేని నగరాలు పొల్యూషన్ ఫ్రీ నగరాలుగా భావించడానికి వీల్లేదు.

సాధారణంగా వాయు కాలుష్యం అనగానే మనకు ఢిల్లీ ముంబై వంటి మహానగరాలు గుర్తుకొస్తాయి. ఆ నగరాల్లోనే వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని భావించడం లేదు. కానీ అది కరెక్ట్ కాదు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే స్థాయిలోనే ఉ:ది.

2024లో పార్లమెంటు వేదికగా వెల్లడించిన వివరాల మేరకు ఏపీలోని 13 నగరాల్లో వాయు కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, కడప నగరాల్లో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంది.

విశాఖపట్నంలో పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు తదితర నగరాలు వాహనాల రద్దీ, నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ వైఫల్యాల కారణంగా కాలుష్య కుహరాలుగా మారాయి.
గాలిలోకి విషం ఎలా చేరుతోంది?

ఇక గాలి కాలకూట విషంగా మారడానికి దారి తీస్తున్న కారణాలు ఏమిటని చూస్తే.. అదుపులేకుండా పెరిగిన వాహనాలు.. ఆ కారణంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల కాలుష్యం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

అతి సూక్ష్మ ధూళి, ఇతర కణాలు. ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలు తీవ్రం అవుతున్నాయి. వాటిలో ప్రధానంగా వాహనాలు, వాటిలో ఉపయోగించే ఇంధన ఇంధన దహనం కారణంగా వెలువడే ఇంధనం, అలాగే.. పారిశ్రామిక ప్రక్రియలు, శిలాజ ఇంధనాల దహనం ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఏర్పడే ప్రమాదకర వాయువు, ఇంకా సూర్యరశ్మి సమక్షంలో ఇతర కాలుష్య కారకాల మధ్య జరిగే రసాయన చర్యలు.. ఇవన్నీ వాయు కాలుష్యం ప్రమాదకర కారకాలకు చేరడానికి కారణాలు.
వీటికి తోడు పొగాకు పొగ, బూజు, పుప్పొడి వంటి పదార్థాలు, పంట వ్యర్థాల దగ్ధం వల్ల వెలువడే వాయువు, అడవుల్లో కార్చిచ్చు, గృహాల్లో ఘన ఇంధనాల వినియోగం కూడా కాలుష్యానికి కారణమవుతుంది. వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల బాధ్యత, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా వ్యవస్థలు పూచీపడాలి.

అదేలాగంటే.. సౌర, పవన్ వంటి పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని ఇతోధికంగా పెంచడం, అదే సమయంలో చమురు వినియోగం నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం. ఇక ప్రజారవాణాను బలోపేతం చేయడం, అంటే.., బస్సులు, రైలు సౌకర్యాలను విస్తరించడం ద్వారా జన బాహుళ్యానికి వాటిని అందుబాటులోకి తీసుకురావాలి. సైకిల్‌ మార్గాలు, నడకకు అనువైన మెరుగును అభివృద్ధి చేయాలి. కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్న లేదా అన్న పరిశీలన నిరంతరాయంగా జరగాలి. అలాగే నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లుతున్న సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా, నిర్మాణ ధూళి, చెత్త దహనంపై నియంత్రణ విధించాలి. నిర్మాణ ప్రాంతాల ధూళి వ్యాప్తిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. చెత్తను బహిరంగంగా కాల్చకుండా దానికి శాస్త్రీయ పద్ధతి అవలంబించాలి.

పంట వ్యర్థాలను కాల్చకుండా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు, సాంకేతికత, ఆర్థిక సహాయాన్ని రైతులకు అందజేయాలి. వీటితో పాటు జనం కూడా ఎవరికి వారుగా వ్యక్తిగత స్థాయిలో కాలుష్య నివారణకు తమవంతు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికి వారు తమ నివాసాలలో పొగ, ధూళి తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.

ఒకప్పుడు తీవ్ర వాయు కాలుష్యంతో కూనారిల్లిన చైనా రాజధాని బీజింగ్.. ఇప్పుడు కాలుష్య నివారణ చర్యలతో కాలుష్య రహిత నగరంగా నిలబడుతోంది. ఆ నగరంలో కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని ఇండియన్ సిటీస్ ముందుకు సాగాలి. బీజింగ్‌లో కాలుష్య నియంత్రణకు వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలపై నియంత్రణలు, స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, నిరంతర పర్యవేక్షణ చర్యలు. కాలుష్యాన్ని తగ్గించాలంటే తాత్కాలిక చర్యలు కాదు శాస్త్రీయ ప్రణాళిక, దీర్ఘకాలిక ఆచరణ ముఖ్యమని బీజింగ్ అనుభవం చాటుతోంది.

కాలుష్యంపై చర్చ ఏటా ఒక్క సీజన్ కు మాత్రమే పరిమితమౌతోంది. ఆ తరువాత చర్చ దానిపై లేదు, కాలుష్య నివారణ చర్యలకు చీటీ పాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాలుష్య నివారణ అన్నది ఎప్పటికీ సాధ్యం కాని, సాధించలేని ప్రణాళికగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. స్వచ్ఛమైన గాలి అన్నది లగ్జరీ కాదు.. ప్రపంచంలో జీవించే ప్రతిమనిషి ప్రథమ హక్కు. అభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రభుత్వాలు, వాటి విధానాలు గాలిని కాలుకూట విషంగా మార్చడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు.

[Air Pollution Effect On Public Health, Health Problems, Air Pollution India,  Andhra Pradesh, Visakhapatnam, Pollution Prevention, Telugu One]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird