
YSRCP: ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై వైసిపి విషం చిమ్ముతూనే ఉంది. చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన విషయాలను సైతం వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వక్రీకరణలు చేస్తూ.. విష ప్రచారానికి తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల మంజూరుకు సుప్రీంకోర్టు నేరుగా పొడిగించిందని.. ప్రభుత్వం మీద తామే అప్పర్ హ్యాండ్ సాధించామని వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా చూస్తే.. గోబెల్స్ ప్రచారం కూడా చిన్న పోతుంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన సారాంశాన్ని కనీసం చదివే వాళ్ళు వైసీపీలో లేరా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన సారాంశాన్ని జాగ్రత్తగా గమనించండి.. పిటిషనర్లు కోరుకున్న విధంగా న్యాయస్థానం ఎక్కడ కూడా బ్లాంకెట్ ఆర్డర్ ద్వారా నామినేషన్ గడుగు పొడిగించలేదు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. నిర్ణయాధికారాలను కమీషన్ కు ఇచ్చేసింది.
కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలోని పరిస్థితులను అంచనా వేస్తూ.. అక్కడ నామినేషన్లకు అనుమతి పొడగించాలా? లేదా? అనే విషయాల మీద నిర్ణయాలు తీసుకునే ఎన్నికల సంఘానికి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గడువు పెంచాలి అని వైసిపి విజ్ఞప్తి చేసినప్పటికీ.. దానిని సుప్రీంకోర్టు లెక్కలోకి తీసుకోలేదు. కేవలం వచ్చిన ఆధారాల ప్రకారమే నిర్ణయం కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికలకు సంబంధించి తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ ఈనెల 25 వరకు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, కమీషన్ తీసుకునే చర్యలపై నివేదిక అందించబడింది.
ఈ న్యాయపక్రియలో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని ప్రాథమిక పరిశీలనలలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరిగింది. అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా జరిగే ఎన్నికలు ఒక భాగం. శాంతిభద్రతల సమస్యలు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నప్పుడు తాము మౌనంగా ఉండలేమని సుప్రీం ప్రకటించింది. ఇదే సమయంలో పిఆర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లను.. ఫిడవిట్లలో ప్రాథమిక ఆధారాలను అందజేసినట్లు తెలుస్తోంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంటే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం మరో విధంగా ఉంది. నేరుగా నామినేషన్ల పొడిగింపు ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఎన్నికల సంఘం సమగ్ర పరిశీలన జరిపి.. ఒక నిర్ణయం తీసుకున్న ఆదేశం మాత్రమే . ఒకవేళ హింస జరిగిన ప్రాంతంలో 48 గంటల సమయం సేవకాశాన్ని ఎన్నికల కమీషన్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చైత్ర స్థాయిలో నివేదికలు తెప్పించుకొని.. పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువరిస్తారు. ఎన్నికల కమీషన్ ఇచ్చే నివేదిక ప్రకారం 27న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరుగుతుంది.
