Home Latest News బాబు, పవన్ లోకేష్ దసరా శుభాకాంక్షలు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్ష.! | CBN పవన్ లోకేస్ దసరా శుభాకాంక్షలు | తెలుగు ప్రజలు | సంతోషంగా | ప్రోస్పరస్ | విజయదశమి – Andhra Waves

బాబు, పవన్ లోకేష్ దసరా శుభాకాంక్షలు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్ష.! | CBN పవన్ లోకేస్ దసరా శుభాకాంక్షలు | తెలుగు ప్రజలు | సంతోషంగా | ప్రోస్పరస్ | విజయదశమి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని ఆయన ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

రైతన్నల శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి దుర్గమ్మతల్లి అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకుంటున్నారని పవన్ కల్యాణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో ఇంద్రకీలాద్రి ఉత్సవాలు మరింత శోభాయమానంగా జరిగాయి. విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయస్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసి ఉంది.

కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన ఈ పవిత్రమైన రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో గొప్ప విజయాలు సాధించాలి” అని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.

[CBN Pawan Lokes Dasara wishes, Telugu People, Happy, Prosparus, Vijayadasami, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird