Home తెలంగాణ ఖైరతాబాద్ గణేష్: ఖైరతాబాద్ గణేష్ టస్కర్ నడిపితే.. – Andhra Waves

ఖైరతాబాద్ గణేష్: ఖైరతాబాద్ గణేష్ టస్కర్ నడిపితే.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఖైరతాబాద్ గణేష్: ఖైరతాబాద్ ప్రాంతంలోని గణపతిని బడా గణేష్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏడాది రికార్డు స్థాయి ఎత్తులో గణపతి ప్రతిమను తయారు చేస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ ప్రారంభ పూజలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంటారు. ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేయడం నుంచి మొదలు పెడితే ఉత్సవాల వరకు […]

ఖైరతాబాద్ గణేష్: ఖైరతాబాద్ ప్రాంతంలోని గణపతిని బడ గణేష్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏడాది రికార్డు స్థాయి ఎత్తులో గణపతి ప్రతిమను తయారు చేస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ ప్రారంభ పూజలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంటారు.

ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేయడం నుంచి మొదలు పెడితే ఉత్సవాల వరకు ప్రతి పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. దీని వెనక ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్వాహకులు ప్రతి ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పైగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం కూడా తనవంతు తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. అందువల్లే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ స్థాయిలో ఘనంగా జరుగుతూ ఉంటాయి.

ఖైరతాబాద్ గణపతిని ప్రత్యేకమైన రూట్ మ్యాపు ద్వారా నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణపతి నిమజ్జన యాత్ర మొదలవుతుంది. ప్రత్యేక టస్కర్ ఏర్పాటు చేసి. దాని మీదుగా గణపతిని తరలిస్తూ ఉంటారు. ఖైరతాబాద్ నుంచి మొదలుపెడితే ట్యాంక్‌బండ్ వరకు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రూట్ మ్యాప్ ను నిత్యం పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. భక్తులు తండోపతండాలుగా రాకుండా ఉండడానికి.. పకడ్బందీగా నియంత్రణ విధానాలను పాటిస్తూ ఉంటారు.

ఖైరతాబాద్ గణపతిని బడా గణేష్ అని పిలుస్తుంటారు. ఈయనను దర్శించుకుంటే కోరిన కోరికల మొత్తం నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతారు. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటుచేసే టస్కర్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ టస్కర్ నడిపే వ్యక్తి మీద స్వామివారి కరుణాకటాక్షాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఈ టస్కర్ నడిపే వ్యక్తి గడిచిన నాలుగేళ్లలో ఇల్లు.. స్థలం కొనుగోలు చేశాడు. అంతేకాదు ఇదంతా గణేశుడి దయవల్ల చెప్పాడు. టస్కర్ నడపక ముందు అతడు ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణపతి టస్కర్ నడపడం మొదలు పెట్టాడో అతడి జీవితం మారిపోయింది. ఆర్థికంగా బలోపేతమయ్యాడు. ఇంటి స్థలం.. ఇల్లు కొనుగోలు చేశాడు. ఇదే అతను గర్వంగా చెబుతున్నాడు.

“నేను ఖైరతాబాద్ మహాగణపతి టస్కర్ నడపడం మొదలు పెట్టిన తర్వాత జీవితం మారిపోయింది. ఆర్థికంగా స్థిరపడ్డాను. ఇల్లు కొన్నాను



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird