Home సినిమా Durga Puja Pandal : పండగ పూట తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసిలాట.. 17 మంది మృతి – Andhra Waves

Durga Puja Pandal : పండగ పూట తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసిలాట.. 17 మంది మృతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Durga Puja Pandal : పండగ పూట తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసిలాట.. 17 మంది మృతి


దసరా పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక దసరా ప్రత్యేక పూజలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పశ్చిమబెంగాల్. ఇక్కడ దుర్గాపూజ చాలా ఘనంగా జరుగుతుంది. దేశవిదేశాల నుంచి ఎందరో ఇక్కడ దుర్గా మాతను చూడటానికి తరలి వస్తారు. భక్తుల పూజలు, ఉత్సవాలతో కోలాహలంగా మారిన కోల్‌కతాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక ప్రముఖ దుర్గాపూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దసరా పండుగ వేళ జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, తీరని శోకాన్ని నింపింది.

ఇరుకైన మార్గాలు, పెరిగిన రద్దీ వల్లే దారుణం

శనివారం ఉత్తర సాయంత్రం కోల్‌కతాలోని చోర్‌బాగన్ సార్వజనిన్ దుర్గా పూజ పండల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. పండల్ లోపలికి ప్రవేశించే, వెలుపలికి వెళ్లే మార్గాలు అత్యంత ఇరుకుగా ఉండటంతో భక్తుల కదలికలు నిలిచిపోయాయి. అదే సమయంలో ప్రాంగణంలో ఒక్కసారిగా జనాల రద్దీ పెరిగిపోవడంతో తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదంలో స్పృహ తప్పి పడిపోయిన బాధితులు, గాయపడిన వారిని ఆంబులెన్సులు వచ్చే వరకు వేచి చూడకుండా స్థానికులు బైక్‌లపై సమీప ఆసుపత్రులకు.

ఇది కూడా చదవండి : సామాన్యుడి నెత్తిన మరో బాంబ్.. ఇడ్లీ, దోశ, మీల్స్ రేట్లు భారీగా పెంపు..!

ఈ ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్‌తో కలసి కలకత్తా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపూ, గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో పూజ పండళ్ల వద్ద భద్రతా చర్యలను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇరుకైన ప్రాంగణాలు, సరైన అత్యవసర నిష్క్రమణ మార్గాలు లేని ప్రదేశాలపై దృష్టి సారించి నిబంధనలు పాటించకుండా మండపాలపై చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird