Home తెలంగాణ Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే.. కేజీఎఫ్ రేంజ్ – Andhra Waves

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే.. కేజీఎఫ్ రేంజ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి దూకుడుగానే వెళ్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా.. పార్లమెంటుసభ్యుడిగా.. ముఖ్యమంత్రిగా ఇలా భిన్న రకాల పాత్రలను పోషించారు. అందులో విజయవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం లాంటిది. కాళ్లలో కట్టెలు పెట్టేవారు పెడుతూనే ఉంటారు. ఇబ్బంది పెట్టేవారు పెడుతూనే ఉంటారు. కాకపోతే వాటిని అధిగమించి ఆ స్థాయికి రావడం అంటే మామూలు కాదు. దీనిని రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో […]

రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి దూకుడుగానే వెళ్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా.. పార్లమెంటుసభ్యుడిగా.. ముఖ్యమంత్రిగా ఇలా భిన్న రకాల పాత్రలను పోషించారు. అందులో విజయవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం లాంటిది. కాళ్లలో కట్టెలు పెట్టేవారు పెడుతూనే ఉంటారు. ఇబ్బంది పెట్టేవారు పెడుతూనే ఉంటారు. కాకపోతే వాటిని అధిగమించి ఆ స్థాయిలోకి రావడం అంటే మామూలు కాదు. దీనిని రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు.

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ భేటీ జరిగింది. ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వారంతా కూడా సర్ నిబంధన మీద తీవ్రంగా చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో కేరళ ముఖ్యమంత్రి.. కర్ణాటక ముఖ్యమంత్రి.. రాహుల్ గాంధీ.. సోనియాగాంధీ.. ప్రియాంక గాంధీ.. మల్లికార్జున కార్గే వంటి వారు ఉన్నారు. వారందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. గ్రూప్ ఫోటోలో రేవంత్ రెడ్డి మాత్రమే తన స్వాగ్ చూపించారు. కాలు మీద కాలు వేసుకుని కే జి ఎఫ్ ఎలివేషన్ ను కళ్ళ ముందు కనిపించేలా చేశారు.

రేవంత్ రెడ్డి మొదట్లో కాస్త అధిష్టానం వైఖరి వల్ల ఇబ్బంది పడ్డారు. అధిష్టానం కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది. కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన దారికి తెచ్చుకున్నారు. కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేలా చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. ఒకరకంగా నేషనల్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి ఎక్స్ పోజ్ అవుతున్నారు. మరోసారి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లి పోతానని ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇటీవల అస్సాంలో ఓ పత్రిక నిర్వహించారు. తన రాజకీయ వ్యవహారాలను బయటపెట్టారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల నిబంధనలను మొహమాటం లేకుండా వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు నరేంద్ర మోడీ పరిపాలన బ్రిటిష్ పరిపాలన విధానం. రేవంత్ రెడ్డి బిజెపితో యుద్ధమే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ.. బిజెపి దోస్తీ వ్యవహారం సాగుతోందని. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఫోటోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిపోయిందని.. ఇక ఆయనకు డోకాలేదని కామెంట్లు చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird