పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్..
సేంద్రియ సాగు చేస్తున్న ద్వారకానాథ రెడ్డిని అభినందించిన మంత్రి..
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న లోకేష్‌కు రైతు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతిలు స్వాగతం పలికారు.
17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న ద్వారకానాథ రెడ్డి కుటుంబం
పెనికలపాడుకు చెందిన రైతు ద్వారకానాథ రెడ్డి, ఆయన సోదరుడు రమణారెడ్డిలు గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వంటి వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేసి సమీకృత సెంద్రీయ సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం అర్జిస్తున్నారు. తమ పొలంలో మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, చిన్న నిమ్మ, నేరేడు, జామ, మునగ, రామఫలం, సీతాఫలం పంటల సాగుతో పాటు 250 వరకు నాటుకోళ్ల పెంపకం, 60 వరకు పొట్టేళ్లు, చేపల సాగు చేస్తున్నారు.
సేంద్రియ సాగును అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్
ఈ సందర్భంగా రైతు ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మంత్రి ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో 70 ఏళ్ల వయస్సున్న సేంద్రియ రైతు లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని తాము సేంద్రియ సాగు చేస్తున్నామని వివరించారు. మొదట ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నిలదొక్కుకున్నామని చెప్పారు.
వ్యవసాయ అధికారులు వ్యవసాయ సేంద్రియ సాగులో మెళకువలపై తిరుపతిలో శిక్షణ అందించారని, బయో రీసర్చ్ సెంటర్ కేటాయించారని తెలిపారు. తమ పొలంలో సహజ పదార్థాలు, 32 రకాల జీవ వైవిధ్య గింజల తయారీని వివరించారు. పురుగుమందులు, రసాయన రసాయనాలు అవసరం ఇప్పుడు మీకు అవసరమైనవి. పంట పెట్టుబడి తగ్గిపోవడంతో సమీకృత సెంద్రీయ సాగు ద్వారా నెలవారీ ఆదాయం పొందుతున్నామన్నారు.
ఒక్క ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రీయ సాగు జరగడానికి అవకాశం ఉంది. 250 నాటుకోళ్ల పెంపకం ద్వారా పొలంలో కలుపు తీసే పనిలేదని, పురుగుమందుల అవసరం లేదని వివరించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి చెట్ల ద్వారా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నామని చెప్పారు. ప్రభుత్వపరంగా మరింత సహకారం అందిస్తే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయవచ్చని ధీమావ్యక్తం చేశారు.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచన .. పంట పొలాల్లో అధిక రసాయన పదార్ధాలు, పురుగుమందుల వినియోగం ద్వారా భూసారం దెబ్బతినడంతో పాటు రైతుకు సాగు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు గారి లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని రైతులను సేంద్రియ సాగువైపు మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
కేంద్రం కూడా కృషిచేస్తోందని వివరించారు. చిరుధాన్యాల సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాయలసీమలో బిందు సేద్యానికి మరింత అండగా ఉంటున్నామని, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు స్థానిక రైతులను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంటుందన్నారు. వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియతిరిగి వివిధ పంటల సాగును మంత్రి పరిశీలించారు.
అనంతరం 32 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి కుంటను మంత్రి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత సేంద్రియ సాగులో అద్భుతాలు సృష్టిస్తూ.. స్థిరమైన ఆదాయం పొందుతున్న మునగాల ద్వారకానాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం రైతు ద్వారకానాథ రెడ్డి కుటుంబం మంత్రి లోకేష్ కు మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతి, ద్వారకానాథ రెడ్డి సోదరుడు రమణారెడ్డి, ద్వారకానాథ రెడ్డి మాతృమూర్తి నారాయణమ్మ, రమణారెడ్డి కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి, కుమార్తె జ్యోతికా రెడ్డి ఉన్నారు.
.webp)

.webp)

.webp)
