Home సినిమా మంగళసూత్రం డిజైన్ వెనుక అసలు కథ బయటపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్! – Andhra Waves

మంగళసూత్రం డిజైన్ వెనుక అసలు కథ బయటపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ బంధం గురించి ఎంత చెప్పినా అభిమానులకు తనివితీరదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ముచ్చట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను దగ్గరుండి నడిపించిన ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి.. ఈ జంట వివాహానికి సంబంధించిన కొన్ని క్రేజీ విషయాలు పంచుకున్నారు.

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు. కానీ ‘విరోష్’ జోడీ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించిందట. పెళ్లిలో తాము వేసుకునే దుస్తుల దగ్గర నుంచి ధరించే ఆభరణాల వరకు ప్రతీదీ సరికొత్తగా ఉండాలని ముందే డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా రష్మిక తన మంగళసూత్రాన్ని వేరే ఎవరికో బాధ్యత అప్పగించకుండా.. స్వయంగా తన ఇష్టపడి డిజైన్ చేయించుకోవడం విశేషం. ఇక వివాహ వేడుకలో రొటీన్ కలర్స్ కాకుండా ఆరెంజ్ రంగు దుస్తులకే ఈ బ్యూటీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రియమైనది.

మరోవైపు ఈ పెళ్లి వేడుకలో రష్మిక మేకప్ వెనుక ఉన్న శ్రమ గురించి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తన్వీ కూడా కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. పెళ్లి రోజున హెవీ మేకప్‌తో కాకుండా చాలా నార్మల్‌గా కనిపించాలని రష్మిక కండిషన్ పెట్టిందట. ‘నేను రోజువారీ జీవితంలో ఎలా ఉంటానో.. పెళ్లి పీటలపై కూడా అంతే సహజత్వంతో కనిపించాలి’ అని మేకప్ టీంకు స్పష్టం చేసింది. కేవలం 40 నిమిషాల్లోనే రెడీ అవుతానని చెప్పారు.. ఆ నేచురల్ లుక్ తీసుకురావడానికి దాదాపు గంటన్నర (90 నిమిషాలు) సమయం పట్టిందని తన్వీ చెప్పారు.

గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ రీల్ కపుల్.. ఇప్పుడు రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లోనే భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వీరి వ్యక్తిగత విషయాలు, పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత కూడా ఈ క్రేజీ కాంబో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఈ స్టార్ కపుల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird