
కొనుగోలు వేగవంతం కోసం అదనంగా రవాణా వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు
అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం
పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనికీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.
ముద్ర ,తుంగతుర్తి….
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల వారి ధాన్యం వివిధ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం తూకాలను, కొనుగోళ్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని శాఖల వారి సమన్వయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కొనుగోలు వేగవంతంగా చేయడానికి అదనంగా రవాణా వాహనాలను అదనంగా హమాలీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రోజుకు పదివేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాలకు అన్‌లోడ్ చేస్తున్నాం .ఇంకా వేగవంతంగా కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట తుంగతుర్తి తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష కుమార్ ఏడిఏ రమేష్ బాబు, ఎస్ఐ క్రాంతి కుమార్, ఏపీఎం యాదమ్మ, ఉన్నారు.