Home Latest News వారానికి ఒకరోజు నో వాహన డే…కేబినెట్ కీలక నిర్ణయం | నో వెహికల్ డే AP | చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు | వర్క్ ఫ్రమ్ హోమ్ AP ఉద్యోగులు – Andhra Waves

వారానికి ఒకరోజు నో వాహన డే…కేబినెట్ కీలక నిర్ణయం | నో వెహికల్ డే AP | చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు | వర్క్ ఫ్రమ్ హోమ్ AP ఉద్యోగులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఆంధ్రప్రదేశ్ ఆర్థికని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక భారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఇంధన పొదుపును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇకపై ప్రతి వారం ఒక ‘నో వెహికల్ డే’గా పాటించాలని కేబినెట్ తీర్మానం చేసింది.

రాష్ట్ర సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ నిర్వహణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, తమ వాహన వినియోగాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా శుక్రవారాన్ని వాహనాలు లేని రోజుగా పాటించి, పర్యావరణ హితానికి తోడ్పడాలని నిర్ణయించారు.

ఈ కొత్త నిబంధన ప్రకారం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారానికి ఒకరోజు తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆ రోజున వారు కేవలం పాదయాత్ర ద్వారా కానీ, సైకిళ్లపై కానీ లేదా ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ బస్సులు) ద్వారా కార్యాలయాలకు చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా, ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను కూడా 50 తగ్గించుకుంటూ స్వయంగా ఆదర్శంగా నిలిచారు.

ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా మంత్రుల విదేశీ పర్యటనలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప ఇకపై ఎలాంటి విదేశీ టూర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ప్రభుత్వ సమావేశాలను కూడా చాలా వరకు వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలోనే నిర్వహించాలని, దీనివల్ల ప్రయాణ ఖర్చులు మరియు సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు, ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం వినయంగా ఆలోచిస్తోంది. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేని విధుల్లో ఉన్న ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) కల్పించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వాడకం మరియు ఇంధన ఖర్చులు తగ్గుదల అంచనా వేస్తున్నారు. అలాగే కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతను 24-27 డిగ్రీల మధ్య ఉంచాలని నిబంధన విధించారు.

రాష్ట్రంలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నా దేశం – నా బాధ్యత’ అనే నినాదంతో ప్రజల్లో కూడా పొదుపుపై ​​అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని సీఎం. ఎనిమిది రాష్ట్రాల్లో 19 లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11 లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ పొదుపు చర్యలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు పర్యావరణ ప్రేమికులు దీనిని స్వాగతిస్తుండగా, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు దీనిని ఎంతవరకు అమలు చేస్తారనేది వేచి చూడాలి. ఈ నిర్ణయాల వల్ల ఏటా వందల కోట్ల రూపాయల ప్రజా ధనం ఆదా అవుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird