Home Latest News ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్ | ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్ | విజయ్ | తమిళనాడు సీఎం | తమిళనాడు ముఖ్యమంత్రి | ఉచిత విద్యుత్ | రాహుల్ గాంధీ | TVK పార్టీ | తమిళనాడు ఎన్నికలు 2026 | విజయ్ క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోలు | TVK ప్రభుత్వ ఏర్పాటు – Andhra Waves

ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్ | ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్ | విజయ్ | తమిళనాడు సీఎం | తమిళనాడు ముఖ్యమంత్రి | ఉచిత విద్యుత్ | రాహుల్ గాంధీ | TVK పార్టీ | తమిళనాడు ఎన్నికలు 2026 | విజయ్ క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోలు | TVK ప్రభుత్వ ఏర్పాటు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తన మొట్టమొదటి సంతకాన్ని చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా, సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని కీలక నిర్ణయాలపై ఆయన సంతకాలు చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం వ్యవస్థను బలోపేతం చేసే ఫైలుపై రెండో సంతకం చేయగా, యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ‘ఈగల్’ తరహా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు మూడో సంతకంతో పచ్చజెండా ఊపారు. సంక్షేమం, రక్షణే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మహిళల భద్రతను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, వేధింపులు, దాడులు, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమిళనాడులో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు విజయ్ ప్రకటించారు. యువతను రక్షించేందుకు డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సమగ్ర దాడి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పారదర్శకత కోసం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని సీఎం చెప్పారు. ప్రజలకు నిజమైన ఆర్థిక స్థితిని తెలియజేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని తెలియజేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ“శత్రువులైనా… మిత్రులైనా… 8 కోట్ల ప్రజలంతా నా ప్రజలే” అని.

కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ “మై డియర్ వర్చువల్ వారియర్స్… న్యూ ఎరా స్టార్ట్స్ నౌ” అంటూ కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాలతో విజయ్ ప్రభుత్వం ప్రజల అంచనాలను ఎంతవరకు నెరవేర్చుతుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా పండుగ వాతావరణం. టీవీకే కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే విజయ్ తన మంత్రివర్గ సహచరులతో భేటీ అయి, పాలనను పరుగులు పెట్టించే దిశగా పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అవినీతి రహిత పాలన అందిస్తారన్న నమ్మకంతో తమిళ ప్రజలు విజయ్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird