అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ట్యాక్స్ వార్ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు. యురోపియ’న్ యూనియ’న్ ఇండియాతో ఇటీవ’ల చేసుకున్నా మ’ద’ర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒప్పందమే కారణమా అంటే.. విదేశీ నిపుణుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఎందుకంటే, ట్రంప్, ఈయూ మధ్య రాజుకున్న గ్రీన్ లాండ్ వివాదం ప్రభావం భారత్ తో యూరోపియన్ యూనియన్ ఒప్పందంలో కనిపించింది.
గ్రీన్ లాండ్ ను ట్రంప్ చెప్పినట్లు అమెరికా ఆక్రమిస్తే.. తాము అమెరికా బ్రాండ్లను రిజెక్ట్ చేసి తమ వద్ద ఉన్న బాండ్లను అమ్మేస్తాం అంటూ ఈయూ దేశాధినేతలు రివోల్ట్ అయ్యారు. అయినా ట్రంప్ తగ్గేదే లే.. అనడంతో మొత్తం రివర్స్ అయ్యింది.దీంతో ఇరవై ఏళ్ల నుంచీ నానుతూ వచ్చిన యురోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ 2026 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా ఒక కొలిక్కి వచ్చింది. ఫలితంగా 27 దేశాలు సమాహారమైన యూరోపియన్ యూనియన్‌తో భారత్ డీల్ సెట్ అయ్యింది. దీంతోనే భారత్ ను ఇక భయపెట్టలేని పరిస్థితి తనకు లేదని ట్రంప్ గ్రహించారు. అందుకే భారత్ పై సుంకాలను 18 నిష్పత్తిలో తగ్గించారు.
కేవలం యురోపియన్ యూనియన్ డీల్ ఒక్కటి మాత్రమే కాదు.. ఇంకా చాలా చాలా అంశాలు కూడా ఇండియా విషయంలో భారత్ వెనక్కు తగ్గడానికి దోహదపడినట్లు చెబుతున్నారు. అవేంటంటే.. చైనాను కట్టడి చేయాలంటే భారత్ అండ అవసరం. ఆపై రెసిప్రోసిటీ. అంటే పరస్పర పన్ను విధింపు. దీనికి కారణం గతంలో బారత్ అమెరికా బ్రాండ్లయిన హార్లే డేవిడ్ సన్ తో పాటు విస్కీ వంటి పలు వస్తువులపై భారీ పన్నులు విధించేది. దీంతో ట్రంప్ భారత్ మా వస్తువులపై ఎక్కువ పన్నులు అంటూ మేమూ చేస్తాం టారిఫ్ వార్ కు దిగారు.
ఐటీవలి కాలంలో భారత ఐఫోన్ వంటి అమెరికా వస్తువులపై కొన్ని రకాల పప్పు ధాన్యాలపై సుంకాలు తగిలాయి. దీనితో యూఎస్ కూడా భారత్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఈ సుంకాల తగ్గుదలను బహుమతిగా అందించింది. ఇదిలా ఉంటే ఐటీ, టెక్నాలజీ అవసరాల పరంగా భారత్ తో చెలిమి అమరికాకు ఒక డీఫాల్ట్ ప్రోగ్రాం లాంటిదని చెబుతారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి లెజండరీ కంపెనీలు భారత్ నుంచి విపరీతమైన సాఫ్ట్వేర్ సేవల సాయం పొందుతున్నాయి. భారత్ పై అతిగా సుంకాలు విధిస్తే అమెరికాలోని టెక్ కంపెనీలు కుదేలౌతాయి. అదే జరిగితే అమెరికా ఎకానమీని బాగా దెబ్బ తింటుంది.
వీటన్నిటికన్నా మించి ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని మోడీ. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ట్రంప్ పదే పదే చేసుకునే స్నేహ పూర్వక సంభాషణ కూడా పనికొచ్చినట్టుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కొన్ని అమెరికా కంపెనీలు తమ కర్మాగారాలను చైనాను వీడి బయట దేశాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటి కంపెనీలకు ఇండియాకు మించిన సురక్షిత ప్రదేశం మరొకటి లేదనడంలో సందేహం లేదు. అమెరికా భారీ సుంకాలు విధిస్తే ఆ కంపెనీలు భారత్‌కి రావడానికి వెనకాడి చైనాలోనే అవకాశం ఉంది. ట్రంప్ భారత్ పై సుంకాల యుద్ధంలో వెనకడుగు వేయడానికి ఇది కూడా ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు.
