Home Latest News మరోసారి సిట్ కస్టడీలో జోగి బ్రదర్స్ | నకిలీ మద్యం కేసు| మాజీ మంత్రి జోగి రమేష్ | కూర్చో| కస్టడీ| జోగి కుటుంబం| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ – Andhra Waves

మరోసారి సిట్ కస్టడీలో జోగి బ్రదర్స్ | నకిలీ మద్యం కేసు| మాజీ మంత్రి జోగి రమేష్ | కూర్చో| కస్టడీ| జోగి కుటుంబం| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
మరోసారి సిట్ కస్టడీలో జోగి బ్రదర్స్ | నకిలీ మద్యం కేసు| మాజీ మంత్రి జోగి రమేష్ | కూర్చో| కస్టడీ| జోగి కుటుంబం| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ


పోస్ట్ చేయబడింది జనవరి 2, 2026 5:24PM


నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్‌ అరెస్ట్‌ సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird