భారత కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి మరో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. YMC కోడ్‌నేమ్‌తో తయారవుతున్న ఈ కారు తాజాగా మరోసారి టెస్టింగ్‌లో కనిపించింది. ఇది 3 వరుసల సీట్లతో వచ్చే ఎలక్ట్రిక్ ఎంపీవీ కావచ్చని ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ ఇంకా అధికారిక వివరాలను ప్రకటించలేదు. ఈ కారు 2026 చివర్లో పరిచయమై, 2027లో అమ్మకాలకు వచ్చే అవకాశం ఉంది.
వెనుక డిజైన్‌లో ఇవే ప్రత్యేకతలు
తాజా స్పై ఫొటోల్లో కారు వెనుక భాగం కొంత స్పష్టంగా కనిపించింది. వెనుకవైపు కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్, చతురస్రాకార టెయిల్‌గేట్, షార్క్‌ఫిన్ యాంటెన్నా, వెనుక వైపర్, డీఫాగర్ ఉండేలా కనిపిస్తున్నాయి. వెనుక భాగం పొడవుగా ఉండటంతో మూడో వరుసకు తగిన స్థలం ఉండొచ్చని. బాడీ క్లాడింగ్ ఉండటం వల్ల ఇది ఎస్యూవీలా కనిపించినా, అసలు మోడల్‌ను కంపెనీ ఎలా మార్కెట్ చేస్తుందో ఇంకా స్పష్టం కాలేదు. ముందు భాగం, ఇంటియర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు రాలేదు.
eVitara ప్లాట్‌ఫామ్‌తో కొత్త కారు?
మారుతి YMC, కంపెనీ eVitara ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన Heartect-e 27PL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడిన అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే రెండు కార్లలో బ్యాటరీ, మోటార్ వంటి కొన్ని సాంకేతిక భాగాలు ఉమ్మడిగా ఉండొచ్చు. 18 ఇంచుల అల్లాయ్ వీల్స్, పూర్తిస్థాయి ఎల్ఈడీ లైటింగ్ కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన అంచనాలే. ఉత్పత్తికి సిద్ధమైన కారు వివరాలు వెల్లడయ్యాకే అసలు డిజైన్‌పై స్పష్టత వస్తుంది.
500 కి.మీ. రేంజ్.. 61kWh బ్యాటరీ?
ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు రావచ్చని అంచనా. పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ రేంజ్ సాధ్యమని కొన్ని నివేదికలు ఉన్నాయి. అయితే కారు పరిమాణం, బరువు కారణంగా వాస్తవ రేంజ్ మారవచ్చు. eVitaraలోని పెద్ద బ్యాటరీ వెర్షన్‌కు కంపెనీ ప్రకటించిన రేంజ్ 543 కి.మీ. వరకు ఉంది. YMCలో మోటార్ పవర్, డ్రైవ్‌ట్రెయిన్ వివరాలు ఇంకా అధికారికంగా తెలియలేదు.
5 సీటర్లు, 7 సీటర్ల ఆప్షన్లు ఉంటాయా?
YMCని 5 సీటర్లు, 7 సీటర్ వెర్షన్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. టాప్ వేరియంట్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లాస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మెటిక్ ఏసీ, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. ADAS సేఫ్టీ ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది. ధర, వేరియంట్‌లు, ఛార్జింగ్ స్పీడు, అధికారిక లాంచ్ తేదీపై మారుతి ఇంకా ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేంజ్, ఫీచర్లను తుది వివరాలుగా భావించకూడదు.
మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
