అద్భుతమైన సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తర్వాత తరంలో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకపోయినా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఈ రోజు శిఖరాన నిలిచాడు. కోహ్లీ ఘనతలు గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. అయితే కోహ్లీ ఈ స్థాయికి వస్తాడని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అనుకోలేదట. కోహ్లీలో మొదటి నుంచే అద్భుతమైన టాలెంట్ కనిపించింది, ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్టార్‌స్టార్‌గా ఎదుగుతాడని అప్పట్లో తాను ఊహించలేదని చెప్పాడు. అయితే, కోహ్లీ టాలెంట్ పై తనకు మొదటి నుంచే నమ్మకం ఉంటుందని, అతడు తన సామర్ధ్యానికి తట్టుగా ఆడితే రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ పరుగుల రికార్డు బ్రేక్ చేస్తాడని భావించినట్లు హర్భజన్ అన్నాడు.
ప్రఖర్ గుప్తా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హర్భజన్ సింగ్.. కోహ్లీ అరంగేట్రం చేసిన తొలి రోజులను గుర్తుచేసుకున్నాడు. 2008లో శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే అతడిలో ఉన్న ప్రతిభను గుర్తించినట్లు హర్భజన్ తెలిపాడు. “అతనిలో చాలా ప్రతిభ. కానీ ఇప్పుడు అతను సాధించిన స్థాయికి చేరుకుంటాడని అప్పట్లో నాకు నమ్మకం లేదు. 2008లో అజంతా మెండిస్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో వెంటనే అర్ధసెంచరీ సాధించడం నాకు గుర్తుంది. అప్పుడే అతనితో ఒక మాట చెప్పాను.
కోహ్లీలో రెండేళ్ల వ్యవధిలోనే ఎంతో గొప్ప బ్యాటర్ గా ఎదిగాడని హర్భజన్ అన్నాడు. ముఖ్యంగా మ్యాచ్‌లను గెలవాలనే తపన, పరుగులు సాధించాలనే ఆకలి అతడిని మరో స్థాయికి తీసుకెళ్లానని అభిప్రాయపడ్డాడు. ప్రతిభ ఒక్కటే సరిపోదని, దానికి క్రమశిక్షణ, పట్టుదల, నిరంతరం మెరుగుపడాలంటే సంకల్పం తోడైతేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని కోహ్లి ప్రయాణం నిరూపిస్తోందని చెప్పొచ్చు. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో 159 పరుగులు చేశాడు. నాలుగో వేదికలో అర్ధసెంచరీ సాధించాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో కూడా ఎన్నో పరుగుల రికార్డులు నెలకొల్పి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సాధించిన రికార్డులలో ఒకడిగా ఎదిగాడు.

