Home అంతర్జాతీయం Bio Inspired Robotics: ఇక బొద్దింకల సైన్యం… కలుగులో దాక్కొనే -Andhra Waves

Bio Inspired Robotics: ఇక బొద్దింకల సైన్యం… కలుగులో దాక్కొనే -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Bio Inspired Robotics: మొన్నటికి మొన్న నీట్ లో అక్రమాలు జరిగాయి.. పేపర్ లీక్ అయిందని చాలామంది రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. అవి హింసాత్మకంగా మారాయి. చివరికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కాక్రోచ్ లు మరింత దూకుడుగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ పార్టీలో చీలికలు వచ్చాయి. చివరికి కాక్రోచ్ జనతా పార్టీ పరిస్థితి మఘ లో […]

బయో ఇన్‌స్పైర్డ్ రోబోటిక్స్: మొన్నటికి మొన్న నీట్ లో అక్రమాలు జరిగాయి.. పేపర్ లీక్ అయిందని చాలామంది రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. అవి హింసాత్మకంగా మారాయి. చివరికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కాక్రోచ్ లు మరింత దూకుడుగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ పార్టీలో చీలికలు వచ్చాయి. చివరికి కాక్రోచ్ జనతా పార్టీ పరిస్థితి మఘ లో పుట్టి పుబలో ముగిసిన అధ్యాయం లాగా మారిపోయింది.

దేశాన్ని కాపాడే బొద్దింకలు

రోడ్లమీదకి వచ్చి.. పిచ్చి పట్టిన వారిలాగా ప్రవర్తించిన కాక్రోచ్ ల గురించి కాసేపు మనం పక్కన పెడదాం. దేశాన్ని కాపాడే బొద్దింకల గురించి మాట్లాడుకుందాం. ఈ బొద్దింకలను తయారు చేసింది ఇజ్రాయిల్.. గోడ పగుళ్లలోకి కూడా చొరబడే రోబోలను ఇజ్రాయిల్ తయారుచేస్తోంది. సాంకేతిక పరిభాషలో వీటిని బయోఇన్స్పైర్ రోబోటిక్స్ అని పిలుస్తుంటారు. యుద్ధ సాంకేతికత వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. సాంప్రదాయమైన క్షిపణులు.. డ్రోన్లు.. యుద్ధ విమానాలు కూడా చేరుకోలేని ప్రాంతాలకు బయో ఇన్‌స్పై రోబోటిక్స్ వంటి మైక్రో డ్రోన్ల సాంకేతికత పై ఇజ్రాయిల్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీటకాల ఆకృతిని పోలి ఉన్న అత్యంత చిన్న రోబోలను ఇజ్రాయిల్ తయారుచేస్తోంది. ఈ రోబోలను బొద్దింకలు.. ఇతర చిన్న చిన్న కీటకాల కదలికలను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు. గోడల పగుళ్లు.. తలుపుల మధ్య ఉన్న చిన్న చిన్న సందుల వంటి ఇరుకైన ప్రదేశాలలో కూడా ఇవి ప్రవేశిస్తాయి .

నిఘా పెట్టడంలో కీలకపాత్ర

మైక్రో రోబోల ప్రధాన లక్ష్యం ఇవి శత్రు స్థావరాలు మీద నిఘా పెడతాయి. కీలకమైన వాటిని అందిస్తాయి. టన్నెల్స్ వంటి కీలక ప్రాంతాలను గుర్తించాయి. మనుషులు లేదా నార్మల్ డ్రోన్లు సులభంగా చేరుకోవాలని ప్రదేశాలలో వీటిని వాడతారు. వీటిని తయారు చేయడానికి ఇజ్రాయిల్ సుమారు 30 అమెరికన్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదురుచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ చిన్న రోబోలు కొంతవరకు ఇండిపెండెంట్‌గా పనిచేసే విధంగా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేకంగా భూగర్భ సొరంగ మార్గాలు.. భవనాల లోపలి భాగాలు.. ఇతర ప్రమాదకరమైన ప్రాంతాల్లో నిఘా పెట్టడానికి ఈ సాంకేతికత నియంత్రిస్తుంది. శత్రువుల కదలికలను గుర్తించడం.. వారి స్థానాలను కనిపెట్టడం.. వంటి పనుల్లో ఈ రోబోలు సైన్యానికి ఉపయోగపడతాయి. నిఘా నుంచి పెడితే నిర్ణయం వరకు.. ఇలా ప్రతి అవసరమైన చర్యకు పట్టే కిల్ చైన్ సమయాన్ని తగ్గించడం కూడా ఈ టెక్నాలజీ వెనుక ఉన్న సైనిక లక్ష్యాలలో ఒకటి అని సూచిస్తుంది.

ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.

ఈ స్థాయిలో ఇండిపెండెంట్ గా పనిచేసే చిన్న రోబోలను సైనిక చర్యలలో ఉపయోగించడం.. సాంకేతిక సామర్థ్యంతో పాటు నైతిక.. చట్టపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే వ్యవస్థలకు మానవ నియంత్రణ ఎంతవరకు ఉండాలి అనే అంశం భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. నేటి కాలంలో యుద్దాల తీరు మారడం ఇతర అంశాల నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇజ్రాయిల్ దేశానికి శత్రు దేశాలు ఎక్కువ. ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ అనేక దేశాలతో ఏకకాలంలో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అందువల్లే ఇజ్రాయిల్ బయో ఇన్‌స్పైర్డ్ రోబోటిక్స్ ను రూపొందించింది. వాస్తవానికి ఇటువంటి టెక్నాలజీ మనదేశంలో కూడా ఉంటే బాగుంటుంది. మనకు దేశంలో ఉన్న కాక్రోచ్ లు, దేశం వెలుపల ఉన్న బొద్దింకలతో నిత్యం ఇబ్బందే. వీటిని కాపాడాలంటే కచ్చితంగా మన దేశానికి అటువంటి వ్యవస్థ ఉండాలి. మోడీ సార్ ఒక్కసారి ఇటువంటి వ్యవస్థ మీద దృష్టి సారించండి ప్లీజ్..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird