Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు: అన్నదాతల్లో ” పట్టా” లేని ఆనందం.. ఇదీ – Andhra Waves

చంద్రబాబు నాయుడు: అన్నదాతల్లో ” పట్టా” లేని ఆనందం.. ఇదీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు: ఆ బుక్కు చూసుకున్న తర్వాత.. తమ పేరు మీద భూమి ఉందని ప్రభుత్వం గుర్తించిన తర్వాత.. అగ్రికల్చర్ లోన్లు ఇస్తారని తెలిసిన తర్వాత.. ఇన్ని రోజులపాటు పడిన ఇబ్బందులు మటుమాయమయ్యాయని తెలిసిన తర్వాత.. ఆ రైతుల కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. ఆ ఆనందాన్ని నింపింది చంద్రబాబు. తన పనితీరుతో.. తన ముందు చూపుతో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి రైతుల ముఖాలలో ఆయన సంతోషాన్ని పరిపుష్టం చేశారు. కొండేపిలో చంద్రబాబు ఉన్నారు. మీ భూమి […]

చంద్రబాబు నాయుడు: ఆ బుక్కు చూసుకున్న తర్వాత.. తమ పేరు మీద భూమి ఉందని ప్రభుత్వం గుర్తించిన తర్వాత.. అగ్రికల్చర్ లోన్లు ఇస్తారని తెలిసిన తర్వాత.. ఇన్ని రోజులపాటు పడిన ఇబ్బందులు మటుమాయమయ్యాయని తెలిసిన తర్వాత.. ఆ రైతులలో ఆనందం మామూలుగా లేదు. ఆ ఆనందాన్ని నింపింది చంద్రబాబు. తన పనితీరుతో.. తన ముందు చూపుతో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి రైతుల ముఖాలలో ఆయన సంతోషాన్ని పరిపుష్టం చేశారు.

కొండేపిలో చంద్రబాబు ఉన్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా కొండేపి నియోజకవర్గంలోని గ్రామంలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో సుమారు 8500 మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించారు. సుమారు నాలుగు మండలాల్లోని 8 గ్రామాలకు చెందిన 1301 మంది రైతులకు సంబంధించిన 2,915 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించారు. భూ రికార్డులలో లోపాలను సరి చేశారు. వివాదాలలో ఉన్న భూములకు పరిష్కారం చూపించారు.

ప్రకాశం జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న గర్భ కండ్రిగ భూ వివాదం ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాన అంశంగా నిలిచింది. ఈ వివాదానికి సంబంధించి నాలుగు మండలాల్లోని 8 గ్రామాల్లో విస్తరించిన 2915 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించారు. ఈ ప్రక్రియ ద్వారా 1301 మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించారు. అంతేకాదు అర్హులైన రైతులకు హక్కులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది చివరి దశలో ఉంది. ఇది కనుక పూర్తయితే కర్షకులకు ప్రయోజనం జరుగుతుంది. ఈ భూములు కొండేపి.. జరుగుమల్లి.. నాగులుప్పలపాడు.. సింగరాయకొండ మండలాల్లో ఉన్నాయి. కొండేపి వారు ఇలవర.. వెన్నూరు గ్రామాలు.. జరుగుమల్లి వాటి పచ్చవ.. వర్దినేనిపాలెం.. నర్సింగోలు… కె బిట్రగుంట.. నాగులుప్పలపాడు కోసం ఒబ్బన్నపాలెం.. సింగరాయకొండ వారి కలికబాయ గ్రామాలలో రైతులు భూ సమస్యల నుంచి విముక్తి పొందారు.

నిజానికి రైతుకి ప్రధాన ఆస్తి భూమి. సాగు నుంచి మొదలుపెడితే బ్యాంకు రుణాలు పొందే వరకు అనేక అవసరాలకు రైతులకు భూమి యాజమాన్యానికి సంబంధించిన రికార్డులు అత్యంత కీలకంగా ఉంటాయి. భూమి విస్తీర్ణం.. సర్వే నెంబర్.. యాజమాన్యంలోని వివరాలలో తేడాలు ఉంటే రైతుల రికార్డు కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పాసు పుస్తకం జారీ తోనే భూ వివాదం పరిష్కారమైంది కాదు. సంబంధిత రికార్డుల సవరణ.. హక్కుల నమోదు.. న్యాయపరమైన అభ్యంతరాల కోసం కూడా పూర్తి కావాల్సి ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణ.. పాసు బుక్కుల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నెలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4.58 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మీ భూమి మీ హక్కు ద్వారా యాజమాన్య వివరాలు అందుబాటులోకి తెచ్చింది. రీ సర్వే ద్వారా భూ సమస్యలను పరిష్కరించారు. భూ రికార్డులలో కూడా పారదర్శకతను పెంచింది .



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird