వెండితెరపై ఆ కళ్ళను చూస్తే చాలు కోట్లాది మంది అభిమానుల హృదయాలు పులకించిపోతాయి. ఆ విశాల నేత్రాలు, అద్భుతమైన అభినయం, వెలకట్టలేని నృత్య ప్రతిభతో టాలీవుడ్‌ని శాసించిన ఆ అభినవ నటన సామ్రాజ్ఞి మరెవరో కాదు.
అందాల తార శోభన. తాజాగా సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌ని హోరెత్తిస్తోంది. ఎప్పటికీ ఒకేలా ఉన్నారంటూ పాతతరం సినీ వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కి పైగా సినిమాల్లో నటించి దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఆమె ఒక వెలుగు వెలిగారు. మలయాళ క్లాసిక్ చిత్రం ‘మణిచిత్రతాళు’ లో ద్విపాత్రాభినయంతో అద్భుతమైన నటన కనబరిచి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును సైతం గెలుచుకున్నారు. సినిమా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన శోభన, కెరీర్ పరంగా క్రేజ్ ఉన్న సమయంలోనే ఎంతో ధైర్యంగా ఒక కీలక నిర్ణయానికి వచ్చారు.
వివాహ బంధానికి దూరంగా ఉంటూ, తన ప్రాణప్రదమైన నాట్యకళకే జీవితాన్ని అంకితం చేయడం నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో ఉంటూ రోజుకు కనీసం నాలుగు గంటలపాటు కఠినమైన నృత్య సాధన చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దేశ విదేశాల్లో భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ భారతీయ సంస్కృతిని చాటుతున్నారు. చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తన తల్లితో కలిసి శోభన, తన రెండంతస్తుల భవంతిలో కింది పోర్షన్‌లో ఒక ప్రసిద్ధ డాన్స్ స్కూల్‌ని విజయవంతం చేశారు. వివాహం చేసుకోకపోయినా జీవితంలో పిల్లలు లేరనే లోటు అస్సలు రాకూడదని భావించి, ఆరేళ్ల క్రితం ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఆ చిన్నారికి అనంత నారాయణి అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆమె నటనకు, నాట్యానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Naga chaitanya: నిర్మాతగా మారిన నాగచైతన్య.. క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్
సుదీర్ఘ సెషన్ తర్వాత శోభన తన కండ్ ఇన్నింగ్స్‌ని ఎంతో ఘనంగా కలిగి ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి లో ఆమె పోషించిన కీలక పాత్రలో ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే లేటెస్ట్‌గా మోహన్ లాల్ హీరోగా నటించిన ‘తుడురుమ్’ సినిమాలోనూ ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతంగా యాక్ట్ చేసి మరోసారి తన నటనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా నృత్య సాధన వీడియోలను పంచుకుంటూ, అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ సరికొత్త స్ఫూర్తిని నింపుతున్నారు.

.webp)