
ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధి..
బుగ్గరం మండలంలో మంత్రి అడ్లూరి సుడిగాలి పర్యటన..
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
బుగ్గరం:
తెలంగాణ రాష్ట్ర ప్రజల మార్పు కోరి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎండని సైతం లెక్కచేయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుగ్గరం మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుందని మంత్రి కాంగ్రెస్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.
బుగ్గరం మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా చిన్నాపూర్ గ్రామంలో రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. గ్రామంలో మహిళా సంఘాల కొరకు ఇప్పటికే వివో భవనానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు.
బుగ్గరం మండల కేంద్రంలోని సాంబశివుని ఆలయం వద్ద రూ. 20 లక్షలతో నిర్మాణ కళ్యాణ మండపానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వచ్చే శివరాత్రి లోపు కళ్యాణ మండప పనులు పూర్తి చేసేందుకు మంత్రి అధికారులను ఈ సందర్భంగా అప్పగించారు. బుగ్గారం జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.20 లక్షలతో చేపట్టిన గ్రంథాలయ నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
యశ్వంత రావు పేట గ్రామంలో రూ. 37.45 లక్షలతో యశ్వంతరావుపేట పెద్ద చెరువు నుండి బొల్లి చెరువు ప్రాజెక్టు వెలుగొండ వరకు సాగునీటి కాలువ అత్యవసర పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. యశ్వంతరావు పేట ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ మంత్రి శంకుస్థాపన చేశారు. బుగ్గరం మండలం శేకల్ల గ్రామంలో రూ.16.10 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్ నిర్మాణం, రూ. 10 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ మంత్రి శంకుస్థాపన చేశారు.
మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు ఉన్నారు.