నందమూరి నటసింహం పద్మభూషణ్ బాలకృష్ణ(బాలకృష్ణ)ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ఫేమ్ గోపిచంద్ మలినేని(Gopichand malineni)దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. NBK111 గా సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన కథతో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో బాలయ్య క్యారక్టర్ పై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాజల్ హీరోయిన్ గా చేస్తుండగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మలయాళ బ్యూటీ హనీ రోజ్ కూడా బాలయ్యతో జతకట్టబోతున్నట్లు సమాచారం.
‘వీరసింహారెడ్డి’ బాలయ్య సరసన రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో హనీ రోజ్ కనిపించింది. ఆమె పోషించిన ‘మీనాక్షి’ క్యారక్టర్ కి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కెమిస్ట్రీ విశేషంగా ఆకట్టుకుంది. ‘సుగుణ సుందరి’ సాంగ్ లో అయితే బాలయ్య, హానీ రోజ్ డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించారు.దీంతో తెలుగులో హనీ రోజ్‌కి విపరీతమైన క్రేజ్ పెరిగినా ఛాన్సులు రాలేదు. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ని పునరావృతం చేయడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం హానీ రోజ్ ని ఎంపిక చేస్తున్నారు. రీసెంట్ గా హానీ రోజ్ కూడా తెలుగు సినిమాలో చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
కూడా చదవండి: Raajeev Kanakala: రాజీవ్ కనకాల అలర్ట్.. రంగంలోకి నవ తెలంగాణ విద్యార్థి శక్తి
హనీ రోజ్ మళ్ళీ బాలయ్య సినిమాలో కనిపిస్తుందనే వార్త వినగానే నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. nbk 111 ని ‘పెద్ది’ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు సృష్టించాడు.

