Home సినిమా టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ – Andhra Waves

టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ – Andhra Waves

by
0 comments
టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్


తగ్గేదెలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి.

1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు

నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు లేనప్పుడు నాగార్జునతో నేరుగా ఒప్పందం ఉన్నప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్ మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన ‘పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాలో విజయ్ రెండో కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం.

3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. ‘సౌండ్ ఆఫ్ పెద్ది’ పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్!

గాడ్ ఆఫ్ మేసెస్ బాలకృష్ణ, మాన్ ఆఫ్ మేసెస్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న నీల్ చిత్రంతో ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్నాడు.

5 . IBOMMA మళ్లీ వచ్చేసింది!

క్రమంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్‌సైట్ తాజాగా మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందించారనేది ఆసక్తికరంగా మారింది. రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే.


6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ లుక్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్‌లో యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఈ స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్.


7 . క్షమాపణలు చెప్తున్న అలీ

హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి నటుడు అలీ అపఖ్యాతి పాలైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో తాను నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఒక పాపులర్ కామెడీ సీన్‌ని స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్‌ని రూపొందించింది.
దాంతో కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు.

8 . పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్!

పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో తదుపరి ఉన్న అల్లు అర్జున్ తన లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజ, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డిజె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నారు.

9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్?

మహేశ్‌బాబు రాజమౌళి ల ‘వారణాసి’ షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వడానికి వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి .

10 . నట్టి కుమార్ రాజీనామా

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జైంట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాలలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird