Home సినిమా మీకే కాదు.. మాకు కూడా సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల సంచలన ప్రెస్ మీట్! – Andhra Waves

మీకే కాదు.. మాకు కూడా సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల సంచలన ప్రెస్ మీట్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సంటేజ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు. ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు.

నిర్మాత యలమంచిలి రవిశంకర్.. “అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని మీరు దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం. ‘హరి హర వీరమల్లు’ విడుదలైన సమయంలోనే ఇన్ని సినిమాల సమస్య తలెత్తింది ఒక పద్దతి ప్రకారం తీయాలి. అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఏకో సిస్టమ్‌లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురూ బాలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల పరిస్థితి కూడా బాగోలేదని చెప్పారు. ఇంకా 70 శాతం బడ్జెట్‌తో సినిమా నిర్మాణంలో లేదు అయితే, కొన్ని షరతులు ఉన్నాయి. హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. “నిన్న ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ చూసిన తర్వాత మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అది బెదిరించినట్టుగా ఉంది కానీ, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నట్టుగా లేదు. మనం ఇలా కొట్టుకోవడం వల్ల లోకువ అయిపోతాం. సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం వెళ్ళట్లేదు. కావడంలేదు. ప్రతిసారీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదోక ఆటంకం కలిగిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సినిమాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని, టికెట్ ధరలు పెంచుకున్నాం. అలాంటిది నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అనుమతి లభించినా, మేము థియేటర్లలో ప్రదర్శించం అంటున్నారు. అంటే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావడంలేదు. ఇలా చేయడం సరైనది కాదు. ప్రతి సినిమా మన సినిమానే. సినిమా నడిస్తేనే సినీ పరిశ్రమను నమ్మకున్న మనందరం నడుస్తాం. అది పక్కన పెట్టి, ఒక్కో సినిమాకు ఒక్కోలా చేయడం అనేది సరైనది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని, నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.” అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. “20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసు. 20 ఏళ్ల నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా?. మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా?. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు?” అన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird