సెల్యులాయిడ్ పైనే కాదు, నిజ జీవితంలో హీరో అనిపించుకునే వ్యకి మంచు మనోజ్(మంచు మనోజ్). ఇందుకు మేము చెప్పమంటే మేమంటే చెప్తామంటూ చాలా మంది ముందుకొస్తారు. అంతలా సమాజంలో జరిగే సంఘటనలపై తన గళాన్ని విప్పుతూ ఉంటాడు. ఈ కోవలోనే రీసెంట్ గా ఇండియా వైడ్ గా సంచలనం సృష్టిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్(బండి సంజయ్)కొడుకు భగీరథ్ పై నమోదైన పోస్కో కేసుపై మనోజ్ స్పందించారు.
మనోజ్ మాట్లాడుతు పదవి, అధికారము, హోదా ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయానికి అడ్డుకాకూడదు. ప్రతి బాలికకు రాజ్యాంగం ప్రకారం సమాన న్యాయం దక్కాలి అంటూ చెప్పాడు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించిన వారిలో మొదటి వ్యక్తిగా మనోజ్ నిలిచాడు. భగీరథ్ పై నమోదైన పోస్కో కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు విషయానికి వస్తే 17 ఏళ్ల మైనర్ బాలికని భగీరథ్ నివాసంగా వేధించారనీ, మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిన బాలిక తల్లి పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న జరిగిన పార్టీలో బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
అయితే.. ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసు చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ బ్లాక్ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని.. అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో బండి బగీరథ్. తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన.
ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. బీజేపీ బేటీ బచావో నినాదంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నేతలపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించేవారు. ఇప్పుడాయన కుమారుడిపైనే కేసు నమోదు అయింది.. ప్రతిపక్షాలు.. నెటిజన్లు బేటీ బచావో కాదు.. బేటా బచావో.. అంటే కొడుకును ముందు కాపాడుకో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రధాని మోడీని ఉద్దేశించి.. మీ శిష్యుడి కొడుకు అరాచకాలు చూడండి అనేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ శత్రువులు బండి సంజయ్‌ను నైతికంగా దెబ్బతీయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు. ఇక’ బీఆర్‌ఎస్ నేతలు, ఇత’ర’ మహిళా సంఘాలు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేశారు, బండి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు ఫిర్యాదులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డింపుల్ హయాతి: వాళ్ళకి అందం కావాలి కానీ మనసుతో పని లేదు.. వైరల్ గా మారిన డింపుల్ హయాతి తీరు
పోలీసుల వెర్షన్ ఏంటంటే.. ఇది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడి కేసు కావటంతో సునిశితమైన వ్యవహారం. బాలిక మైనర్ లేకుండా ప్రాథమికంగా అయితే ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా.. పోక్సో కేసు నమోదు చేశామని, అయితే బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. డిజిటల్ ఆధారాలైన చాటింగ్‌లు, ఫోన్ కాల్స్ కేసులో కీలకం కానున్నాయంటున్నారు.
